ఆంధ్రప్రదేశ్‌

పాక్షికం.. ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం వైకాపా, వామపక్షాలు, కాంగ్రెస్ పార్టీ మంగళవారం పిలుపునిచ్చిన బంద్ ప్రశాంతంగా జరిగింది. అన్ని వర్గాల వారు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించారు. ముఖ్యంగా విద్యా, వ్యాపార సంస్థలు పూర్తిగా మూతబడ్డాయి. సినిమా హాళ్లలో ఉదయం ఆటలు రద్దయ్యాయి. పోలీసులు ముందుజాగ్రత్త చర్యగా అర్ధరాత్రి నుంచే నాయకుల అరెస్టుల పర్వం ప్రారంభించారు. కొందరు నాయకుల ఇళ్లను చుట్టుముట్టి వారిని అరెస్టు చేశారు. రాష్టవ్య్రాప్తంగా రోజుకు 10,891 ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగించాల్సి ఉండగా 2,931 బస్సులు నిలిచిపోయాయి. సాధారణంగా రోజుకు రూ.15కోట్ల రూపాయలు ఆదాయం రావాల్సి వుండగా బంద్ వల్ల రూ.4కోట్ల మేర ఆర్టీసీకి నష్టం వచ్చింది. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనల్లో ఐదు బస్సులు ధ్వంసమయ్యాయి. ప్రధానంగా విజయవాడలోని పండిట్ నెహ్రూ బస్టేషన్, ఇతర డిపోల వద్ద ఉదయానే్న బైఠాయించిన పలువురు నాయకులను పోలీసులు అరెస్టు చేసి సుదూర ప్రాంత పోలీస్ స్టేషన్లకు తరలించారు. నగరంలో భారీ ర్యాలీలు జరిగాయి. ఈ సందర్భంగా పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. కృష్ణా జిల్లాలో మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సుల రాకపోకలకు అంతరాయం కలిగింది. రాష్టవ్య్రాప్తంగా వామపక్షాల నేతలు పెద్దసంఖ్యలో అరెస్టయ్యారు. ఇదిలావుండగా తెలుగుదేశం అర్బన్ కార్యదర్శి గనె్న ప్రసాద్ ఆధ్వర్యంలో పలుచోట్ల శాంతి ర్యాలీలు, గులాబీ పువ్వులు పంపిణీ చేశారు.
గుంటూరు జిల్లాలో..
ప్రత్యేక హోదాపై ప్రతిపక్షాలు నిర్వహించిన బంద్ గుంటూరు జిల్లాలో పాక్షికంగా, ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సహా వందలాది మంది నాయకులు, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి వ్యక్తిగత పూచీకత్తుపై సాయంత్రానికి విడుదల చేశారు. గుంటూరు ఆర్టీసీ బస్‌డిపో వద్ద ఆందోళన నిర్వహిస్తున్న ఎమ్మెల్యే ముస్త్ఫా, తదితర నాయకులను ముందుస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. బంద్ సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. కొన్ని పాఠశాలలకు ముందస్తు సెలవు ప్రకటించారు. వ్యాపార, వాణిజ్య సంస్థలను సాయంత్రం వరకు మూసివేశారు. రైళ్లు యథావిధిగా తిరిగాయి.
‘అనంత’లో...
అనంతపురం: హోదా కోసం వైకాపా, వామపక్షాలు చేపట్టిన బంద్ అనంతపురం జిల్లాలో మంగళవారం సంపూర్ణంగా జరిగింది. వైకాపా, వామపక్షాలు, కాంగ్రెస్ వేర్వేరుగా బంద్ పాటించాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా, ప్రైవేటు సర్వీసులు నిలిపివేశారు. హోటళ్లు, దుకాణాలు, పాఠశాలలు మూతబడ్డాయి.
కర్నూలులో...
కర్నూలు: ప్రత్యేక హోదా కోసం తలపెట్టిన బంద్ కర్నూలు జిల్లాలో విజయవంతమైంది. విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, సినిమా హాళ్లు మూసివేశారు. జిల్లాలోని 13 ఆర్టీసీ డిపోల్లో 900లకు పైగా బస్సులను మధ్యాహ్నం వరకు ముందు జాగ్రత్త చర్యగా అధికారులు డిపోలకే పరిమితం చేశారు. ఆ తరువాత పోలీసుల సూచన మేరకు క్రమేణా బస్సులు రోడ్డుపైకి వచ్చాయి. జాతీయ రహదారులపై ఆందోళనకారులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
కడప జిల్లాలో...
కడప: కడప జిల్లాలో బంద్ సందర్భంగా అన్ని వ్యాపార, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, పెట్రోల్ బంక్‌లు మూతబడ్డాయి. మధ్యాహ్నం వరకు ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పలువురు వైకాపా నాయకులు ఉదయమే దుకాణాలను మూయించారు. బంద్‌లో పాల్గొన్న ఎమ్మెల్యేలు, ఇతర నాయకులను పోలీసులు అరెస్టుచేసి అనంతరం విడిచిపెట్టారు.
ఉత్తరాంధ్రలో...
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం: ప్రత్యేక హోదా కోసం సిక్కోల్‌లో నిర్వహించిన బంద్ విజయవంతమైంది. కాంగ్రెస్, సిపిఎం, సిపీఐ, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి. ఎన్జీవోల సంఘం నాయకులు, స్వచ్ఛంద సంస్థలు మాత్రం బంద్‌కు దూరంగా ఉన్నాయి. కామ్రేడ్లపై పోలీసుల లాఠీ ప్రతాపం చూపించింది. జిల్లా కేంద్రం ఆర్టీసీ బస్సు స్టేషన్ వద్ద వైకాపా నేత తమ్మినేని సీతారాం నేతృత్వంలో బస్సులు రోడ్డెక్కకుండా బైఠాయించారు. జిల్లా అంతటా వైకాపా, వామపక్షాల నాయకులు, కార్యకర్తలు ఎక్కడిక్కడ 724 మంది అరెస్టు అయ్యారు. నియోజకవర్గాలవారీగా వైకాపా వ్యూహాత్మకంగా బంద్ ప్రశాంతంగా విజయవంతం చేసింది. విశాఖ జిల్లాలో రాష్ట్ర బంద్ పాక్షికంగాను, ప్రశాంతగాను జరిగింది. బంద్‌ను పురస్కరించుకుని విపక్ష పార్టీలు తలపెట్టిన ఆందోళనను పోలీసులు అణచివేశారు. విశాఖ నగర పరిధిలో బంద్ సందర్భంగా వైకాపా, కాంగ్రెస్, వామపక్షాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి, పాడేరు ప్రాంతాల్లో బంద్ పాక్షికంగా జరిగింది. నర్సీపట్నం డివిజన్‌లో బంద్ ప్రభావం ఎక్కడా కన్పించలేదు.
జిల్లాలో బంద్ పాక్షికంగా, ప్రశాంతంగా జరిగింది. ముందుజాగ్రత్త చర్యగా జిల్లా కేంద్రంతోపాటు అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తున్న వైకాపా, సిపిఐ, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఉదయం పదిగంటల వరకు ఆర్టీసి బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. కీలకప్రాంతాల్లో పోలీసులు పికెట్లు ఏర్పాటు చేశారు.
చిత్తూరులో...
తిరుపతి/ఒంగోలు/నెల్లూరు: పుణ్యక్షేత్రాల నిలయమైన చిత్తూరు జిల్లా మంగళవారం ప్రత్యేక హోదా నినాదాలతో హోరెత్తింది. చిత్తూరు జిల్లావ్యాప్తంగా రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు ఉదయం 11 గంటల వరకు రోడ్డెక్కలేదు. తిరుమలకు వెళ్లే శ్రీవారి భక్తులకు ఆందోళనకారులు మినహాయింపు ఇవ్వడంతో వారికి ఎలాంటి అసౌకర్యం కలగలేదు. ఆందోళనకారులను అరెస్ట్ చేసినప్పటికీ వ్యాపారులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నారు. బ్యాంకులు కూడా మూతపడ్డాయి. చిరు వ్యాపారులు మినహాయిస్తే తక్కిన వారందరూ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. ఆర్టీసీ అధికారులు బస్సులను బస్టాండులకే పరిమితం చేశారు.
తిరుపతిలో...
వైకాపా రాష్ట్ర కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు, నాయకులు ఉ. 5 గంటలకే తెలుగుతల్లి విగ్రహం వద్ద బైఠాయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థి సంఘాలు పలుచోట్ల రాస్తారోకోలు, మానవహారాలు నిర్వహించారు. ఆందోళన చేసిన ప్రతి ఒక్కరినీ పోలీసులు అరెస్టుచేసి ప్రత్యేక వాహనాల్లో వివిధ పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు.
ప్రకాశం జిల్లాలో...
ప్రకాశం జిల్లాలో వైఎస్‌ఆర్‌కాంగ్రెస్, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐపార్టీలు చేపట్టిన బంద్ విజయవంతమైంది. ఆయా పార్టీలకు చెందిన నేతలు ఆర్‌టిసి డిపో గ్యారీజిల వద్ద బైఠాయించారు. దీంతో మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి, గిద్దలూరు, కనిగిరి, కొండెపి నియోజకవర్గాలకు చెందిన పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. రాజకీయ పార్టీలకు చెందిన నేతలు ర్యాలీలు, ధర్నాలతో హోరెత్తించారు.
నెల్లూరు జిల్లాలో...
నెల్లూరు జిల్లాలో బంద్ పాక్షికంగా జరిగింది. జిల్లాలోని కావలి, ఆత్మకూరు, సూళ్లూరుపేట పట్టణాల పరిధిలో మాత్రం ఉదయం కాస్త బంద్ హడావుడి కనిపించింది. నెల్లూరు నగరంలో మాత్రం బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. గూడూరు డివిజన్‌లోని సూళ్లూరుపేట, గూడూరు ప్రాంతాల్లో బంద్ విజయవంతంగా జరిగింది.
గోదావరి జిల్లాల్లో...
కాకినాడ/ఏలూరు: వైఎస్సార్ కాంగ్రెస్, ఇతర విపక్షాలు నిర్వహించిన బంద్ ఉభయ గోదావరి జిల్లాల్లో విజయవంతమైంది. దాదాపు అన్ని ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌కు సహకరించి, ప్రత్యేక హోదాపై తమకున్న ఆకాంక్షను చాటిచెప్పారు. విద్య, వాణిజ్య సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. పెట్రోలు బంకులు సైతం మూతపడ్డాయ. ప్రభుత్వ కార్యాలయాలను నాయకులు మూయించివేశారు. తెల్లవారుజాము నుంచే ఆందోళనకారులు ఆర్టీసీ డిపోల ముందు బైఠాయించడంతో సర్వీసులు నిలిచిపోయాయి. బంద్‌లో పాల్గొన్న వివిధ రాజకీయ పక్షాల నేతలు రాస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలతో హోరెత్తించారు. ఎక్కడికక్కడ నిరసనకారులను పోలీసులు అడ్డుకుని, అరెస్టుచేశారు.
తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో పోర్టు సహా పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల కార్యకలాపాలు స్తంభించాయి. కలెక్టరేట్ కార్యకలాపాలను వైఎస్‌ఆర్ కాంగ్రెస్, ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ముట్టడించాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అన్ని విద్యా, వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మూసివేశారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆందోళనకారులు మూయించివేశారు.

హోదా రాకపోతే... ఇంతే!
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంత ఉందో వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకులు మంగళవారం రాజమహేంద్రవరంలో వినూత్నంగా చూపించారు. విద్యావంతులైన నిరుద్యోగులతో సైకిల్‌మీద తెచ్చిన కూరగాయలు అమ్మించారు. మెడలో విద్యార్హతలు తెలిపే బోర్డులు తగిలించుకున్న యువకులు కూరగాయలు విక్రయించారు. ప్రత్యేక హోదా రాకపోతే ఉద్యోగ నియామకాలు లేక విద్యావంతులకు ఇలాంటి దుస్థితి ఏర్పడుతుందని
వారు పేర్కొన్నారు.