ఆంధ్రప్రదేశ్‌

ఏపి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా 35వేల మందికి లబ్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, ఆగస్టు 3: ఎపి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా గత ఏడాది 15వేల మందికి లబ్ధిచేకూర్చామని, ఈఏడాది 35వేల మందికి లబ్ధి చేకూర్చాలని నిర్ణయించామని కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు వెల్లడించారు. రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది కార్పొరేషన్ ద్వారా రూ.35 కోట్ల విలువైన పథకాలు వర్తింపజేశామని, ఈఏడాది రూ.65 కోట్ల విలువైన పథకాలు వర్తింపజేయనున్నట్లు తెలిపారు.
ఈ ఏడాది అదనంగా రూ. 60కోట్ల నిధులను కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరతామన్నారు. వచ్చే రెండేళ్లలో రూ.125 కోట్ల చొప్పున జమచేస్తే ప్రభుత్వం ప్రకటించిన విధంగా కార్పొరేషన్ ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి 500 కోట్లు కేటాయించినట్టవుతుందన్నారు. బ్రాహ్మణుల స్థితిగతులపై చేపట్టిన సర్వే వచ్చే నెల 15 నాటికి పూర్తవుతుందని భావిస్తున్నామన్నారు.
సామాజికాభివృద్ధిలో భాగంగా భార్గవ భాగస్వామ్య పథకం కింద కాకినాడలో బ్రాహ్మణ కమ్యూనిటీ హాలును నిర్మించామన్నారు. బుధవారం జగ్గంపేటలో మరో కమ్యూనిటీ హాలును ప్రారంభించామన్నారు. రాజమహేంద్రవరంలో కూడా 20 సెంట్ల భూమిని సేకరించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు.
బ్రాహ్మణుల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం గాయత్రీ విద్యాప్రశస్తి, పేద విద్యార్థుల కోసం భారతీ విద్యాపథకం, పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల కోసం వశిష్ఠ, నైపుణ్యాభివృద్ధి కోసం ద్రోణాచార్య, ఔత్సాహిక ప్రారిశ్రామికుల కోసం చాణక్య, 50ఏళ్లు నిండిన పేద బ్రాహ్మణుల కోసం చరక ఆరోగ్య బీమా, అనాథ పిల్లలు, వృద్ధుల పెన్షన్ కోసం కశ్యప ఆశ్రయ, అనాథల అంత్య క్రియల కోసం గరుడ పథకాలను అమలుచేస్తున్నామని వివరించారు.

విలేఖర్ల సమావేశంలో
మాట్లాడుతున్న ఐవైఆర్ కృష్ణారావు