రాష్ట్రీయం

గనుల శాఖపై కొరడా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4:గనుల శాఖ ప్రక్షాళనకు ప్రభుత్వం నడుం బిగించింది. సంవత్సరాల తరబడి ఒకేచోట పాతుకుపోయిన అధికారులు, సిబ్బంది వల్ల ఇసుక అక్రమ రవాణాతోపాటు ఇతరత్రా జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడానికి సంబంధిత శాఖ మంత్రి కెటిఆర్ నడుం బిగించారు. ఒకేరోజు 93 మంది అధికారులను బదిలీ చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర స్థాయి అధికారులు, జిల్లా అధికారులు, అన్ని స్థాయిల వారు ఈ బదిలీ జాబితాలోఉన్నారు. చాలాకాలంనుంచి ఒకే చోట పని చేస్తున్న వారందరినీ బదిలీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి విడతగా 93 మందిని బదిలీ చేశారు. ఇందులో భాగంగా వరంగల్ డిడి కెలక్ష్మణ్‌ను నిజామాబాబాద్‌కు బదిలీ చేశారు. హెడ్ ఆఫీసులో ఉన్న యాదగిరిని వరంగల్‌కు బదిలీ చేశారు. 13 మంది అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్లకూ బదిలీ తప్పలేదు. బి జయరాజును సూర్యాపేటకు, ఎన్ నర్సింహారెడ్డిని ఖమ్మం, పి ప్రదీప్‌కుమార్‌ను వరంగల్‌కు బదిలీ చేశారు. విజిలెన్స్ అసిస్టెంట్ డిప్యూటీ డైరెక్టర్ సి నర్సింహులును హెడ్ ఆఫీసుకు బదిలీ చేశారు. జె అమరేందర్‌రావును మహబూబ్‌నగర్‌కు, ఎం బాలదాస్‌ను కరీంనగర్, పి మధుసూధన్‌రెడ్డిని కొత్తగూడెం, జి సుధాకర్‌రెడ్డిని మిర్యాలగూడ, ఎ సురేందర్‌ను నల్లగొండకు బదిలీ చేశారు. విజయ్‌కుమార్ రాథోడ్‌ను హెడ్ ఆఫీసుకు, టి సామ్యూల్ జాకబ్‌ను తాండూర్‌కు, జి భాస్కర్‌రెడ్డిని నిజామాబాద్ నుంచి హైదరాబాద్‌కు బదిలీ చేశారు. మొత్తం 14 మంది అసిస్టెంట్ జియాలజిస్టులను బదిలీ చేశారు. అన్ని జిల్లాలకు చెందిన 34 మంది రాయల్టీ ఇన్‌స్పెక్టర్‌లను బదిలీ చేశారు. అదేవిధంగా అన్ని జిల్లాలకు చెందిన 34 మంది టెక్నికల్ అసిస్టెంట్‌లను బదిలీ చేశారు. మంత్రి కెటిఆర్ ఇటీవల గనుల శాఖ ప్రక్షాళనకు పలు చర్యలు తీసుకున్నారు. విధానపరంగా పలు కొత్త నిర్ణయాలు తీసుకున్నా క్షేత్ర స్థాయిలో మార్పు రావాలంటే చాలాకాలం నుంచి పాతుకుపోయిన వారిని కదల్చాలనే నిర్ణయానికి వచ్చారు. పలు ప్రాంతాల్లో కెటిఆర్ రహస్యంగా పర్యటనలు జరిపి మైనింగ్స్‌లో ఏం జరుగుతోందో ప్రత్యక్షంగా పరిశీలించారు. మహబూబ్‌నగర్ జిల్లా, కరీంనగర్ జిల్లాల్లో ఆయన ఇటీవల విస్తృతంగా పర్యటించారు. కరీంనగర్ పర్యటనలో తన వాహనాన్ని వదిలి పోలీసు వాహనంలోనే ఇసుక రీచ్ వద్దకు వెళ్లి కూలీలతో కూడా మాట్లాడారు. విధానాల రూపకల్పన ఒక్కటే సరిపోదని క్షేత్ర స్థాయిలో మార్పులు అవసరం అనే ఉద్దేశంతో మొత్తం గనుల శాఖలు బదిలీలు చేయాలని నిర్ణయించారు. బదిలీలపై ఉన్న ఆంక్షలను సడలిస్తూ 93 మంది అధికారులను బదిలీ చేశారు. మైనింగ్ శాఖలో ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో బదిలీలు జరగడం ఇదే మొదటి సారి.

బదిలీ అయంది వీరే!

డిప్యూటీ డైరెక్టర్లు ఇద్దరు
అసిస్టెంట్ డైరెక్టర్లు ఇద్దరు
అసిస్టెంట్ జియాలజిస్టులు 14 మంది
రాయల్టీ ఇన్‌స్పెక్టర్లు 30 మంది
టెక్నికల్ అసిస్టెంట్లు 34 మంది