రాష్ట్రీయం

హోదా కోసం దీక్ష చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రత్తిపాడు, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్ సమస్యగా మారిన ప్రత్యేక హోదాపై కేంద్రానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్ష చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేశ్ సిద్ధం కావాలని మాజీ మంత్రి, కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం సవాల్ చేశారు. ఆమరణ దీక్షకు సిద్ధపడితే వారితోపాటుగా వారి ఇంట్లో దీక్షకు చోటు కల్పిస్తే తాను కూడా దీక్షలో కూర్చుంటానన్నారు. ఎవరెన్ని రోజులు దీక్ష చేయగలరో పరీక్షకు నిలబడాలని ఆయన కోరారు. ఈ దీక్షను సవాల్‌గా స్వీకరించడం వల్ల ప్రత్యేక హోదాతోపాటు శరీరాల పటుత్వం, పట్టుదల, చిత్తశుద్ధి ప్రజలకు తెలుసుకునే అవకాశం ఉంటుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.
తన సూచనను స్వీకరిస్తే మీతోపాటుగా దీక్షలో కూర్చోడానికి సిద్ధంగా ఉన్నానని చెబుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ముద్రగడ మూడు పేజీల లేఖను రాశారు. దయచేసి తన సలహాను పాటించి, కబురు పంపించాలని లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖను తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో గురువారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన విడుదల చేశారు. కాపులకిచ్చిన హామీని అమలు చేయమని కోరితే తనను, తన కుటుంబాన్ని అవమానించారని, అయినా చింత లేదని, మీ నుంచి విచారం, క్షమాపణలు కోరడం లేదని చంద్రబాబును ఉద్దేశించి లేఖలో తెలియజేశారు. చీము, నెత్తురు, పౌరుషం లేదని చంద్రబాబు దయ వల్ల తానొక అనాథ, అల్పుడనని, ఎన్ని అవమానాలు చేసినా, చేయించినా ఆఖరికి బూటు కాలితో తన్నినా భరిస్తానన్నారు. ఆర్థికంగా, సామాజికంగా దుర్భరమైన పరిస్థితుల్లో ఉన్న 2 కోట్ల మంది బలిజ, తెలగ, వంటరి, కాపులకోసం పోరాటం చేయడం తన బాధ్యతగా భావించి ఉద్యమానికి సిద్ధపడ్డానన్నారు.
కాపులకు బిసి రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్రానికి 9వ షెడ్యూల్లో చేర్చమని కోరుతూ అసెంబ్లీ చేసే తీర్మానంకోసం ఎదురుచూస్తూ ఉంటానని అంటూ ముద్రగడ తన లేఖను ముగించారు.

చిత్రం.. ముఖ్యమంత్రికి రాసిన లేఖను కిర్లంపూడిలో విడుదల చేస్తున్న మాజీ మంత్రి ముద్రగడ