రాష్ట్రీయం

ఎన్టీపిసి నియామకాలను నిలిపివేసిన హైకోర్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: సికింద్రాబాద్‌లోని సదరన్ రీజియన్ ఎన్టీపిసి సంస్థ చేపట్టిన జూనియర్ మజ్దూర్ ఉద్యోగాల భర్తీపై హైకోర్టు స్టే విధించింది. ఈ మేరకు జస్టిస్ ఏ రామలింగేశ్వరరావు గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి నిరుడు డిసెంబర్‌లో ఎన్టీపిసి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నోటిఫికేషన్‌ను సవాలు చేస్తూ సి అరవిందరావు పిటిషన్ దాఖలు చేశారు. వౌఖిక పరీక్ష ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేయడం అక్రమమని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫున న్యాయవాది వి రవికిరణ్‌రావు వాదనలు వినిపిస్తూ అవకతవకలను అరికట్టేందుకు రాత పరీక్ష నిర్వహించాలనేది కేంద్రం విధానమన్నారు. కేంద్రం జారీ చేసిన మార్గదర్శకాలకు విరుద్ధమని భావిస్తూ ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై స్టే ఇస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది. అనంతరం ఈ కేసు విచారణను కోర్టు వాయిదావేసింది.