రాష్ట్రీయం

హైకోర్టు విధులకు నేడు హాజరుకావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 4: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ రాష్ట్రంలోని వివిధ బార్ అసోసియేషన్లు ఇచ్చిన పిలుపు మేరకు 5వ తేదీ శుక్రవారం హైకోర్టు విధులకు హాజరు కాకూడదని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన న్యాయవాదులు నిర్ణయించారు. ఏపి బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సి నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్రం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని ఉల్లంఘించి ఆంధ్రప్రయోజనాలకు విఘాతం కలిగిస్తోందని తెలిపారు. కేంద్రం తక్షణమే ఏపికి ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కాగా 13 మంది న్యాయవాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసినందుకు నిరసనగా 5వ తేదీ శుక్రవారం విధులకు హాజరు కాకూడదని తెలంగాణ న్యాయవాదుల సంఘం నిర్ణయించింది. తెలంగాణ న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు గండ్ర మోహన్‌రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని బార్ అసోసియేషన్ల న్యాయవాదులు శుక్రవారం విధులకు హాజరు కారని చెప్పారు.