రాష్ట్రీయం

విదేశాల్లోనూ ఇక ఐఐటి జెఇఇ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐటి జెఇఇ ప్రవేశ పరీక్షను కొత్తగా మరో 9 దేశాల్లో కూడా నిర్వహించాలని అపెక్స్ అథారిటీ నిర్ణయించింది. కొత్తగా విదేశాల నుండి వచ్చి చేరే విద్యార్థుల కారణంగా దేశంలో విద్యార్థులకు సీట్ల కొరత లేకుండా విదేశీయులు ఏ మేరకు ఉత్తీర్ణులయితే ఆ మేరకు అదనపు సీట్లు కేటాయించాలని కూడా నిర్ణయించారు. తాజా నిర్ణయంతో అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్, భూటాన్, మాల్దీవులు, సింగపూర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఇథియోపియాలలో ఈ ప్రవేశపరీక్షను నిర్వహిస్తారు. ఐఐటి జెఇఇ అడ్వాన్స్ పరీక్ష రాసేందుకు ఈ దేశాలకు చెందిన వారికి అర్హత కల్పిస్తారు. అయితే వీరికి ఎలాంటి స్కాలర్‌షిప్‌లను చెల్లించడం జరగదు. ఒకవేళ స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించినా, వారు చెల్లించే ఫీజుకు మించకుండా స్కాలర్‌షిప్‌ను ఇస్తారు. భారతీయ విద్యార్థులకు, విదేశీ విద్యార్థులకు సౌకర్యాల పరంగా ఎలాంటి వివక్ష లేకుండా చూస్తారు. విదేశాల్లో ఐఐటి జెఇఇ సదుపాయాల గురించి వివరించేందుకు ఐఐటి ముంబయిని నోడల్ ఏజెన్సీగా గుర్తించారు. ఆ సంస్థ నుండి బృందాలు ఎంపిక చేసిన దేశాలలో పర్యటించి సీట్లు, వివరాలు, సౌకర్యాల గురించి వివరిస్తారు. ఈ నిర్ణయం 2017-18 విద్యాసంవత్సరం నుండి అమలులోకి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.

నిర్ణయం తీసుకోలేదు

ముందు రఘువీరాతో చర్చించాల్సి ఉంది
టిడిపిలో చేరిక ప్రచారంపై దేవినేని నెహ్రూ

విజయవాడ, ఆగస్టు 5: అధికార తెలుగుదేశం పార్టీలోకి పునఃప్రవేశం చేయాలంటూ ఆ పార్టీ నేతల నుంచి గత కొద్ది రోజులుగా సంకేతాలు రావటం వల్లనే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావుతో మాట్లాడానని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి దేవినేని రాజశేఖర్ (నెహ్రూ) అన్నారు. అయితే తాను తెలుగుదేశంలో చేరిపోతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇప్పటివరకు తాను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదంటూ అసలు దీనికి సంబంధించిన సమాచారం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు వద్ద ఉన్నదో లేదో కూడా తనకు తెలియదన్నారు. తెలుగుదేశంలో చేరుతున్నట్టు జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రభూమి ప్రతినిధి ఆయన దృష్టికి తీసుకువచ్చినప్పుడు నెహ్రూ పైవిధంగా స్పందించారు. పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారని ఆయన వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా పలు అంశాలపై చర్చించాల్సి వుందన్నారు. కాంగ్రెస్ పార్టీలో తాను మొదటి నుంచి అన్ని విషయాల్లోనూ రఘువీరాతో కలిసి ప్రయాణం చేసినందున ఆయనంటే తనకెంతో గౌరవం వుందన్నారు. మొదటి నుంచి తాను పచ్చి అవకాశవాదిని కాదని, రాజకీయ స్వార్థపరుడుని అంతకంటే కాదని అన్నారు. తాను ఇప్పటివరకు ఏ పార్టీలోకి ప్రవేశించినప్పటికీ ముందుగా రాష్ట్ర వ్యాప్తంగానున్న అనుచరులు, అభిమానులతో సంప్రదించి వారందరితో కలిసి ముందుకు సాగుతున్నానని అన్నారు. ముఖ్యంగా తన ముఖ్య సన్నిహితుడు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కడియాల బుచ్చిబాబు కుమారుడి వివాహం హడావుడిలో వున్నానని అన్నారు. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ఆ పార్టీలో చేరాలంటూ ఆహ్వానాలు వచ్చాయని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇప్పటికైనా వైకాపా కాంగ్రెస్‌తో కలిసి ప్రయాణం చేస్తే ఆ పార్టీకి ఉజ్వల భవిష్యత్ వుంటుందని భావించానన్నారు. అయితే ఆ పరిస్థితి కన్పించకపోవటంతో ఆ పార్టీ గురించి కూడా ఆలోచించడం మానేశానని అన్నారు.