రాష్ట్రీయం

నకిలీ సర్ట్ఫికెట్ల ముఠా గుట్టురట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: దేశంలోని వివిధ యూనివర్శిటీలకు చెందిన నకిలీ ఎడ్యుకేషనల్ సర్ట్ఫికెట్లు తయారుచేసి అమ్ముతున్న ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులను హైదరాబాద్ ఈస్ట్‌జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 24 డిగ్రీ, బి టెక్, ఎంఎస్సీ సర్ట్ఫికెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఉప్పర్‌పల్లికి చెందిన మహమ్మద్ ఖాలేద్ (32) మెహిదీపట్నంకు చెందిన జీషాన్ అలీఖాన్ (22) సైఫాబాద్‌కు చెందిన మహమ్మద్ ఉస్మాన్ (57) నూరీ డిస్టెన్స్ ఎడ్యుకేషనల్ అకాడమీని నిర్వహిస్తూ, వివిధ యూనివర్శిటీలకు చెందిన నకిలీ సర్ట్ఫికెట్లను తయారు చేసి విక్రయించే పథకం వేశారు. ఈ మేరకు ఢిల్లీకి చెందిన విశాల్ శర్మ, షోయబ్‌లతో పరిచయం చేసుకున్నారు. హైదరాబాద్‌లో తయారు చేసిన సర్ట్ఫికెట్లను ఢిల్లీలో విక్రయించేందుకు విశాల్ శర్మ, షోయబ్‌లను ఏజెంట్లుగా నియమించుకున్నారు. ఒక్కో సర్ట్ఫికెట్‌కు రూ. 10 నుంచి 15 వేలు కమిషన్ ఇచ్చారు. మహమ్మద్ ఉస్మాన్ ఒక్కో సర్ట్ఫికెట్‌కు రూ. 20 వేల నుంచి రూ. 40 వేలకు సరఫరా చేస్తున్నట్టు టాస్క్ఫోర్స్ డిప్యూటీ కమిషనర్ ఎన్ కోటిరెడ్డి తెలిపారు. ఓ వ్యక్తికి నకిలీ డిగ్రీ సర్ట్ఫికెట్ అమ్ముతుండగా వీరిని ఇన్‌స్పెక్టర్ సిహెచ్ సుధాకర్ నేతృత్వంలోని బృందం పట్టుకుంది. విశాల్, షోయబ్ పరారీలో ఉన్నారు. వీరి కోసం గాలిస్తున్నట్టు డిసిపి కోటిరెడ్డి తెలిపారు. నిందితులను తదుపరి చర్య నిమిత్తం బహదుర్‌పుర పోలీసులకు అప్పగించినట్టు టాస్క్ఫోర్స్ డిసిపి చెప్పారు.