రాష్ట్రీయం

రేపు ఎమ్సెట్-3 నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశానికి ఎమ్సెట్ -3ని సెప్టెంబర్ 11న నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి పాపిరెడ్డి వెల్లడించారు. జెఎన్‌టియు విసి ఎ వేణుగోపాల్‌రెడ్డి, కన్వీనర్, జెఎన్‌టియు హెచ్ రెక్టార్ ఎన్ యాదయ్య, కో-కన్వీనర్ ఎ గోవర్ధన్, కమిటీ సభ్యులతో చైర్మన్ పాపిరెడ్డి సమావేశమై ఎమ్సెట్-3 నిర్వహణను సమీక్షించారు. పరీక్ష నిర్వహించిన వారం పది రోజుల్లోనే ఫలితాలు అందించాలని నిర్ణయించారు. పరీక్షకు సంబంధించి ఈనెల 8న నోటిఫికేషన్ వెలువడనుంది. హాల్‌టిక్కెట్లను సెప్టెంబర్ 3నుంచి జారీ చేస్తారు. పరీక్ష సెప్టెంబర్ 11న ఉదయం 10నుండి మధ్యాహ్నం 1 గంట వరకూ జరుగుతుంది. ఎమ్సెట్-2 పరీక్ష రాసిన అభ్యర్ధులు మాత్రమే ఎమ్సెట్-3 రాసేందుకు అర్హులని అధికారులు స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ నెంబర్లలో ఎలాంటి మార్పూ ఉండబోదని, కనుక అభ్యర్ధులు రిజిస్ట్రేషన్ ఫీజు మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. పాత హాల్‌టిక్కెట్లు చెల్లబోవని, కొత్త హాల్‌టిక్కెట్లను కొత్త వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఎమ్సెట్-3లో ఆన్‌లైన్ పరీక్ష విధానం లేదని, అంతా పెన్ను, పెన్సిల్‌తో రాయాల్సి ఉంటుందన్నారు. రీజనల్ సెంటర్లలో ఎలాంటి మార్పూ ఉండదని, అయితే అభ్యర్ధుల పరీక్ష కేంద్రాలు మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాలుగా కేవలం ప్రభుత్వ కాలేజీలు, పాఠశాలలను మాత్రమే ఎంపిక చేయనున్నారు.
ఎమ్సెట్ -3 ఫలితాలను పరీక్ష జరిగిన వారంలోనే విడుదల చేస్తామని కన్వీనర్ ప్రొఫెసర్ యాదయ్య తెలిపారు. ఎమ్సెట్-3 కమిటీ తొలి సమావేశం శనివారం ఉన్నత విద్యామండలిలో జరిగింది. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణకు తీసుకోవల్సిన జాగ్రత్తలపై చర్చించారు. అభ్యర్ధులు ఒక్క నిమిషం కూడా ఆలస్యంకాకుండా పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుందని కన్వీనర్ స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో అభ్యర్ధుల ఫింగర్ ప్రింట్‌లను తీసుకుంటామన్నారు.