రాష్ట్రీయం

ఇంటి వద్దకే పుష్కర జలాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 6: ఈ నెల 12వ తేదీ నుంచి 23వ తేదీ వరకు జరిగే కృష్ణా పుష్కరాలకు వెళ్లేందుకు వీలు లేని వారి కోసం ఆడ్రోబ్.ఇన్ అనే ఇ కామర్స్ సంస్థ వినూత్న ప్రయోగానికి పూనుకుంది. కృష్ణా జలాలను సేకరించి శుద్ధిచేసి వాటిని ఒక లీటర్ బాటిల్‌లో నింపి, హోం డెలివరీ చేయనున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. దీనికి కృష్ణా జల్ అని నామకరణం చేసింది. వాక్ ఫర్ వాటర్ అనే ఎన్‌జివోతో కలిసి ఈ విధానాన్ని ప్రారంభించినట్లు ఆడ్రోబ్ తెలిపింది. ఆడ్రోబ్.ఇన్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఆన్‌లైన్ ద్వారా కృష్ణా పుష్కర జలాలను బుక్ చేసుకోవచ్చు. ఇంటికి వచ్చి పుష్కర దీపాన్ని తీసుకెళ్లి కృష్ణా నదిలో హారతి, దీపం ఇస్తారు. పూర్తి వివరాలకు 040 40044442 లేదా 040 40028738ను సంప్రదించాలని ఆ సంస్థ కోరింది.