రాష్ట్రీయం

ఎస్సీ వర్గీకరణ సమంజసమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చార్మినార్/హైదరాబాద్, ఆగస్టు 6: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమంజసమేనని తెలంగాణ పొలిటికల్ జెఎసి చైర్మన్ ప్రొ.కోదండరాం అభిప్రాయపడ్డారు. దీనిపై నిర్ణయం తీసుకోవల్సింది కేంద్ర ప్రభుత్వమేనని, ఇందుకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ఆయన స్పష్టం చేశారు. ఎస్సీల వర్గీకరణకు సంఘీభావంగా శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన సదస్సులో కోదండరాం ముఖ్య అతిధిగా ప్రసంగిస్తూ, వర్గీకరణ చిచ్చుతో దళితుల్లో ఐక్యత క్షీణించి, దళిత సమాజానికి నష్టం చేకూరుస్తోందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని దళితులంతా ఐక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ఎస్సీల వర్గీకరణ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, ఇందుకు మాలలు కూడా కలిసివచ్చి వాటాలు సక్రమంగా పంపిణీ అయ్యేలా చూసుకోవాలని కోదండరాం సూచించారు.