రాష్ట్రీయం

చేనేతకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 6: ‘రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. ఉపాధి కష్టమైంది. యంత్రాలు రావడంతో చేనేతకు ఆదరణ తగ్గిపోతోంది. ఈ పరిస్థితుల్లో చేనేత కార్మికుల్ని అన్నివిధాలా ఆదుకుంటాం. వారి సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోంది’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. శనివారం అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణంలోని జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ‘చేనేతకు చంద్రన్న చేయూత’ బహిరంగ సభలో సిఎం ప్రసంగిస్తూ రాష్ట్రంలో రూ.110.96 కోట్లతో చేనేత రుణ విముక్తి పథకం ప్రారంభించామన్నారు. చేనేత రుణమాఫీ అమలుచేసిన ప్రభుత్వం దేశంలో తమదేనన్నారు. ఇందులో ఒక్క అనంతపురం జిల్లాలోనే 10,115 మంది చేనేతలకు రూ.36.42 కోట్ల రుణం మాఫీ అయిందన్నారు. ధర్మవరంలో ఉన్న 65 చేనేత కార్మిక సంఘాల్లోని 3,433 మందికి రూ.13.50 కోట్లు రుణమాఫీ అయిందన్నారు. అలాగే 73,362 మంది చేనేత కార్మికులకు పెన్షన్లు ఇస్తున్నామన్నారు. ఈ ఏడాది నుంచి రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన పథకాన్ని రూ.10 కోట్లతో తిరిగి అమలు చేస్తామన్నారు. రాష్టవ్య్రాప్తంగా 35,500 మంది చేనేత కార్మికులకు పట్టు దారానికి ప్రస్తుతం రూ.600 ఇస్తున్న సబ్సిడీని రూ.1000కు పెంచుతున్నామన్నారు. అలాగే రేరింగ్ షెడ్ల నిర్మాణానికి ప్రస్తుతం ఇస్తున్న రూ.82,500కు అదనంగా రూ.1.10 లక్షలు ఇస్తామని ప్రకటించారు. నేత ఉత్పత్తులు విక్రయించుకునేందుకు వీలుగా ధర్మవరంలో 50 రీలర్స్ ఏర్పాటుకు 10 ఎకరాలు, హిందూపురంలో 100 రీలర్స్‌కు 20 ఎకరాల్లో షెడ్స్, యంత్రాలకు రూ.21 కోట్లు మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే హౌస్ కం వర్క్ షెడ్‌ను రూ.3 లక్షలతో నిర్మించి ఇస్తామన్నారు. చేనేతలు తమ ఉత్పత్తుల్ని నేషనల్ టెక్స్‌టైల్ కార్పొరేషన్, హ్యాండ్‌లూమ్ ఎక్స్‌పోర్టులో విక్రయించుకునేలా చర్యలు చేపట్టామన్నారు. నేత కార్మికులు, వారి పిల్లల కోసం నైపుణ్యశిక్షణ తరగతులకు వెంకటగిరిలో రూ.9.56 కోట్లతో నూతన కోర్సులు ఏర్పాటు చేశామన్నారు. అనంతపురం జిల్లాలో 35 వేల ఎకరాల్లో మల్బరీ అభివృద్ధి కానుందని, షెడ్స్ ఏర్పాటుకు రూ.1.10 కోట్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లాను హార్టికల్చర్ హబ్‌గా మారుస్తామన్నారు. జిల్లాలో పండించే వేరుశెనగకు ప్రపంచ మార్కెట్ కల్పిస్తామన్నారు.

చిత్రం..ధర్మవరంలో మగ్గం నేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు