రాష్ట్రీయం

ఉద్రిక్తంగా మావోల బస్తర్ బంద్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 6: మావోయిస్టు పార్టీ శనివారం నిర్వహించిన బస్తర్ బంద్ ఉద్రిక్తతల నడుమ సాగింది. బూటకపు ఎన్‌కౌంటర్లు, మహిళలపై భద్రతాబలగాల అత్యాచారాలను నిరసిస్తూ బస్తర్ ప్రాంతంలోని బస్తర్, దంతెవాడ, సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి నుంచే మావోయిస్టులు వరుస సంఘటనలకు పాల్పడ్డారు. ఖమ్మం జిల్లా చర్ల మండలం ఆర్.కొత్తగూడెంతో పాటుగా ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్, సుక్మా జిల్లాల్లో మావోయిస్టులు బ్యానర్లు కట్టారు. కరపత్రాలు వదిలారు. బాసగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలోని సార్కెగూడ వద్ద భద్రతాబలగాలను మట్టుబెట్టేందుకు మావోయిస్టులు అమర్చిన 12 కిలోల మందుపాతరను 204 కోబ్రా బెటాలియన్‌కు చెందిన బలగాలు నిర్వీర్యం చేశాయి. సుక్మా జిల్లా కుంట-ముర్లిగూడ ప్రాంతంలో రోడ్లు తవ్వి, బ్యానర్లు కట్టారు. బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కుంట సిఆర్‌పిఎఫ్ క్యాంపునకు కేవలం కిలోమీటర్ దూరంలోనే ఈ ఘటన జరిగింది.