ఆంధ్రప్రదేశ్‌

దూబగుంట రోశమ్మ కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిగిరి, ఆగస్టు 7: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఒకప్పుడు సంపూర్ణ మద్య పాన నిషేధానికి మూలకారకురాలైన దూబగుంట రోశమ్మ కన్నుమూశారు. ఆమె వయసు 93 సంవత్సరాలు. మూడేళ్లుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న రోశమ్మ ఆదివారం స్వగ్రామం దూబగుంటలో మరణించారు. నెల్లూరు జిల్లాలోని మారుమూల ప్రాంతమైన జలదంకి మండలం గట్టుపల్లి చింతలపాలెంలో రోశమ్మ 1923లో జన్మించారు. చిన్నప్పుడు తల్లిదండ్రులతో కలిసి వ్యవసాయ పనులకు వెళ్లేవారు. పెద్దయ్యాక కలిగిరి మండలం దూబగుంటకు చెందిన వర్దినేని కొండయ్యతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. 30 ఏళ్ల క్రితం రోశమ్మ భర్త కొండయ్య అనారోగ్యంతో మృతి చెందారు. సారాకు బానిసలైన భర్తల వేధింపులు తాళలేని మహిళలను చూసి, రాత్రి బడుల్లో చెప్పిన కథలను స్ఫూర్తిగా తీసుకుని గ్రామస్థాయిలో సారా ఉద్యమాన్ని ప్రారంభించి రాష్టస్థ్రాయికి తీసుకెళ్లిన ఘనత రోశమ్మది. ఉద్యమానికి బీజం దూబగుంటలోనే పడింది. 1991 జులై నెలలో దూబగుంటలోని మహిళలు మిరపకాయల కోతకు వెళుతుండగా కలిగిరి నుంచి కల్లు అమ్మేందుకు గ్రామానికి వస్తున్న వాహనాన్ని అడ్డుకొని వాటిని ధ్వంసం చేయడంతో ఉద్యమం ఊపందుకుంది. అనంతరం గ్రామంలోని మహిళలు అందరు కలిసి అప్పటి సర్పంచ్ కోడూరు రమణారెడ్డి సహకారంతో గ్రామంలోని సారా దుకాణాలను మూయించి వేశారు. ఈ సంఘటన చుట్టుపక్కల గ్రామాలకు పాకింది. ఈ సంఘటనలకు రోశమ్మ నాయకత్వం వహించారు. దీంతో పక్క జిల్లాల వారు కూడా రోశమ్మను స్ఫూర్తిగా తీసుకుని ఆయా జిల్లాలకు పిలుపించుకొని ఉద్యమాలు నడిపించడంతో 1993లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు.
రాష్ట్రంలో మద్య నిషేధానికి కారణమైన గ్రామం పేరునే ఇంటి పేరుగా మార్చుకున్న దూబగుంట రోశమ్మ పలువురి ప్రశంసలు అందుకున్నారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు తనను అభినందించిన తీరు మరిచిపోలేనని ఆమె చివరి రోజుల్లో చెబుతుండేవారు. సోమవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

దూబగుంట రోశమ్మ (ఫైల్ ఫొటో)