ఆంధ్రప్రదేశ్‌

ఆటుపోట్లతోనే ఉద్యమం వైపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు/ఆత్మకూరు, ఆగస్టు 7: సారా వ్యతిరేక ఉద్యమ వీర వనితగా పేరొందిన దూబగుంట రోశమ్మ అసలు పేరు వర్దినేని రోశమ్మ. పేద కుటుంబానికి చెందిన ఈమె తన జీవనగమనంలో ఎదుర్కొన్న ఆటుపోట్లే సారా ఉద్యమానికి ఊపిరిలూదాయి.
నెల్లూరుజిల్లా కలిగిరి మండలం దూబగుంట గ్రామానికి చెందిన ఈమె పేరు 1990వ దశకపు తొలినాళ్లలో అందరి నోటా మార్మోగింది. కాలక్రమంలో ఆమె ఊరి నామధేయమే ఇంటి పేరుగా మారిపోయింది. భర్తమృతితో కుటుంబాన్ని నెట్టుకురావడం ఆమెకు కష్టతరంగా మారింది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఆమె సంతానం. ఆ ఊరి మహిళలెందరో ఇంట్లో భర్తల మద్య వ్యసనంతో నిత్యం అగచాట్లు ఎదుర్కొంటూ వచ్చారు. భర్తల ఆరోగ్యం దెబ్బతినడంతోపాటు ఆయా కుటుంబాల ఆర్థిక నేపథ్యం అస్తవ్యస్తంగా ఉండేది. దీనికితోడు అన్ని కుటుంబాల్లోనూ నిత్య కలహం రచ్చ తోరణం అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సందర్భంలో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు అక్షర జ్ఞానం లేని వయోజనుల్లోనూ విద్యాబుద్ధులు నేర్పేందుకు నడుం బిగించారు. అక్షర దీపం పేరిట సంధ్యా సమయంలో నిర్వహించిన విద్యాభ్యాస కార్యక్రమాలు దూబగుంట మహిళల్లో అంతులేని చైతన్యానికి వారధిగా అక్కరకొచ్చాయి. జన సంక్షేమమే ధ్యేయమని చెప్పే పాలకులు అదే ప్రజల ఆరోగ్యానికి వినాశకరమైన సారా వ్యాపారాన్ని ప్రోత్సహించడం ఏమిటని నిలదీసే నైజానికి బాటలు వేసింది. మద్యాన్ని విక్రయించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడదనే ప్రశ్నించే ధోరణి ఆ ఊరి నారీలోకపు నరనరాల్లోనూ ఆవహించింది. దూబగుంట ధీర వనితల స్ఫూర్తి తెలుగునాట సారా రక్కసిని పారదోలేలా పాగా వేసుకుంది. రోశమ్మ నేతృత్వంలో అరుదైన పోరాట బాటలో పయణించేలా తోడ్పాటు అందించింది. ఆమె ఓ దిక్సూచిగా వ్యవహరించి ఇరుగుపొరుగు గ్రామాల్లో మహిళలందరినీ కూడగట్టారు. సారా వ్యాపారాన్ని కూకటివేళ్లతో పెకలించే వేసేలా పట్టుబడుతూ పోరాటం సాగించారు. దూబగుంటలో ఆరంభమైన పోరాటం తొలుత పక్క పల్లెలకు అటు నుంచి తమ సొంత మండలమైన కలిగిరికి, ఆ తరువాత నెల్లూరుజిల్లా, రాష్ట్రం అంతటా ఉద్ధృద ఉద్యమంగా కొనసాగింది. ఇలా రోశమ్మ సహా దూబగుంట మహిళలందరూ ఆశించిన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. ఉద్యమపంథా సాగించిన సందర్భాల్లో ఎప్పటికప్పుడు సర్కారీ వేధింపులూ అనేకంగానే ఉండేవి. తొలుత 1991 జూలై నెలలో నెల్లూరువాకిట ఈ దూబగుంట గ్రామంలో సారా వ్యతిరేక ఉద్యమానికి శ్రీకారం చుట్టగా, అప్పట్లో ఇదే జిల్లాకు చెందిన నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా రాణిస్తుండటం గమనార్హం. అనతికాలంలోనే ఉద్యమం తారస్థాయికి చేరుకుని ఊరువాడలన్నీ దూబగుంట రోశమ్మకు జైకొట్టాయి. జిల్లాకు చెందిన రాష్ట్ర ముఖ్యమంత్రి తీరుని తప్పుబట్టాయి. సారా వ్యతిరేక ఉద్యమం 1992లో రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడలాడించింది. నేదురుమల్లి తరువాత ముఖ్యమంత్రిగా ఏలుబడిలోకి వచ్చిన కోట్ల విజయభాస్కరరెడ్డి ఇక చేసేదేమి లేక రాష్ట్రంలో సారా విక్రయాల్ని రద్దు చేశారు. అప్పట్లో విపక్ష నేతగా ఉన్న నందమూరి తారకరామారావు సైతం దూబగుంట రోశమ్మతో కలసి అడుగులు వేశారంటే అతిశయోక్తికాదు. ఆనాటి ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొని తాను తిరిగి ముఖ్యమంత్రి కాగానే సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేస్తామని ఎన్టీఆర్ హామీ ఇచ్చి అమలుచేసేలా కూడా దూబగుంట రోశమ్మ కీలకపాత్ర పోషించడం విశేషం.

దూబగుంట రోశమ్మ మృతదేహం. రోశమ్మ (ఇన్‌సెట్‌లో ఫైల్ ఫొటో)