ఆంధ్రప్రదేశ్‌

పారిశ్రామిక కారిడార్‌గా దొనకొండ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 7: రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేందుకు చైనా, సింగపూర్, జపాన్ కంపెనీలు ఉత్సాహం చూపిస్తున్నాయని, పారిశ్రామికవేత్తలకు అనుమతులు వేగవంతంగా మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రవాణా శాఖ మంత్రి శిద్దా రాఘవరావు తెలిపారు. ఆదివారం ఒంగోలులో సింగపూర్ ఎస్‌సిపి కన్సల్టెంట్ పిటిఇ లిమిటెడ్ కంపెనీ డిప్యూటీ జనరల్ మేనేజరు ట్యాంగ్‌వై ఫై మంత్రి శిద్దాను మర్యాదపూర్వకంగా కలిశారు. దొనకొండ ప్రాంతంలో సింగపూర్ కంపెనీలు పరిశ్రమలు స్థాపించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించామని ఆ ప్రాంతం పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని మంత్రికి సింగపూర్ కన్సల్టెంట్ వివరించారు. ఈసందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ భారతదేశంలో గుజరాత్ తరువాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిశ్రమల స్థాపనకు అనుకూలంగా ఉందని రిజర్వుబ్యాంకు ఆఫ్ ఇండియా, ప్రపంచ బ్యాంకులు అంగీకరించాయన్నారు. దొనకొండ ప్రాంతంలో 25 వేల నుండి 30వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయన్నారు.
దొనకొండ ప్రాంతంలో పరిశ్రమలు స్థాపించేందుకు చైనా, సింగపూర్, జపాన్ దేశాల పారిశ్రామికవేత్తలు సందర్శించటం జరిగిందన్నారు. రష్యన్, ఉక్రెయిన్ దేశాల ప్రతినిధులు హెలికాప్టర్స్, విమానాల తయారీ పరిశ్రమను దొనకొండలో స్థాపించేందుకు ఇటీవల దొనకొండను పరిశీలించారన్నారు. దొనకొండలో పరిశ్రమల స్థాపనకు అవసరమైన డిఆర్‌ఆర్‌ఒ ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపినట్లు తెలిపారు. ఆ ప్రక్రియ పూర్తయితే త్వరలో పనులు ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
సందడిగా అంత్య పుష్కరాలు
భద్రాచలం, ఆగస్టు 7: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి సన్నిధిలో గోదావరి అంత్యపుష్కరాలు సందడిగా సాగుతున్నాయి. ముగింపు దగ్గర పడుతున్న కొద్దీ భద్రాచలం స్నానఘట్టాల వద్ద భక్తుల సంఖ్య పెరుగుతోంది. 8వ రోజు ఆదివారం సెలవు దినం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు పుష్కర స్నానాలు ఆచరించారు. రామాలయంలో సైతం రామునికి అభిషేకాలు, సువర్ణ పుష్పార్చనలు జరిగాయి. సాయంత్రం గోదావరి నదికి హారతులు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

మోదీకి ఘన స్వాగతం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఆగస్టు 7: ప్రధాని హోదాలో తెలంగాణకు తొలిసారిగా వచ్చిన నరేంద్ర మోదీకి బేగంపేట విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించేందుకు ఆదివారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఇక్కడకు వచ్చారు. రాష్ట్ర గవర్నర్ ఇఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ, తెలంగాణ డిజిపి అనురాగ్‌శర్మ, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, బిజెపి నాయకులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో మెదక్ జిల్లా గజ్వేల్‌కు వెళ్లారు. ప్రధాని వెంట గవర్నర్, సిఎం కెసిఆర్, కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, దత్తాత్రేయ ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. సిసి కెమెరాల నిఘాలో అడుగడుగునా తనిఖీలు నిర్వహించారు.

హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో నాలుగువేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను