ఆంధ్రప్రదేశ్‌

బాల మేధావి ప్రపంచ రికార్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేదాయపాళెం, ఆగస్టు 7: నెల్లూరు జిల్లాలోని మండల కేంద్రమైన కోటకు చెందిన బాల మేధావి షేక్ తబీబ్ అహ్మద్‌కు అరుదైన రెండు వరల్డ్ రికార్డులు దక్కాయి. భారత్ వరల్డ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డు వారు ఆదివారం నెల్లూరులో నిర్వహించిన పోటీలో తబీబ్ అహ్మద్ రికార్డు సృష్టించాడు.
90 నిమిషాలలో 158 రకాల వైద్య మొక్కలను గుర్తించటంతోపాటు తెలుగు, సంస్కృతం, సాంకేతిక పేర్లను చెప్పడం ఈ పోటీ ముఖ్య ఉద్దేశ్యం. అయితే షేక్ తబీబ్ అహ్మద్ 1515 పేర్లను పూర్తిగా నాలుగు సమాధానాల్లో చెప్పి రికార్డు సృష్టించాడు. ఈ సందర్భంగా ముఖ్యఅతిధిగా విచ్చేసిన నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలలోని మేధాశక్తిని గుర్తించి ప్రోత్సహిస్తే బాల మేధావులు తయారవుతారన్నారు. ఇప్పటివరకు ఐదు వరల్డ్ రికార్డులు సాధించిన తబీబ్ అహ్మద్ నేటి తరం బాలలకు మార్గదర్శి కావాలని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వరల్డ్ రికార్డు సిఇఓ శివప్రసాద్ మాట్లాడుతూ బాల మేధావిని ప్రోత్సహించిన తల్లిదండ్రులను, తిరుపతి శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ మెడికల్ అధికారి డాక్టర్ డి.నారపరెడ్డిలను అభినందించారు.
బాలమేధావి ఏడవ సంవత్సరంలో డాక్టర్ రికార్డు కోసం నిర్వహించిన పోటీలో 700 ప్రశ్నలకు 689 సమాధానాలు చెప్పి మూడు రికార్డులు సాధించాడని తెలిపారు.
అనంతరం యూనివర్శల్ బుక్ ఆఫ్ వరల్డ్, అమేజింగ్ వరల్డ్, గోల్డెన్‌స్టార్ అవార్డులను జేసీస్ క్లబ్ అధ్యక్షుడు మురళీకృష్ణ, నగర మేయర్ అబ్దుల్ అజీజ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకనాధ్ చేతుల మీదుగా అందచేసి ఘనంగా సత్కరించారు.

బాల మేధావి తబీబ్ అహ్మద్‌ను సన్మానిస్తున్న దృశ్యం

పెళ్ళింట విషాదం!

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం

గాజువాక, ఆగస్టు 7: విశాఖపట్నం జిల్లా గాజువాక దరి ఉక్కునగరంలోని ఓ పెళ్ళి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. విశాఖ ఉక్కులో టెలికాం విభాగంలో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఆనందరావు ఉక్కునగరం సెక్టార్-6లో గల 429 క్వాటర్‌లో కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. శనివారం రాత్రి ఆనందరావు చిన్న కుమారుడు సుజిత్‌కు వివాహం చేశారు. ఆదివారం తెల్లవారు జామున కుమారుడి పెళ్లి ముగించుకుని బంధువులతో కలిసి ఇంటికి వచ్చిన ఆనందరావు మధ్యాహ్నాం పెద్దకుమారుడు అజిత్ అత్తామామలు ఆర్‌వి కామేశ్వరరావు, సుజాతలు తిరిగి హైదరాబాద్ వెళ్లేందుకు పయనం అయ్యారు. సుజాతను ఉండాలని ఆనందరావు కుటుంబీకులు పట్టుబట్టారు. దీంతో సుజాత భర్త కామేశ్వరరావును వియ్యంకుడు ఆనందరావు, భార్య సుజాతలు కారులో దువ్వాడ రైల్వేస్టేషన్‌లో దించి తిరిగి వస్తుండగా ఉక్కునగరం అల్లూరి సీతారామరాజు సర్కిల్ వద్ద ప్రమాదానికి గురయ్యారు. కారు వేగంగా వచ్చి సర్కిల్ ఢీకొట్టింది. కారులో ఉన్న ఆనందరావు, సుజాతలు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ మేరకు స్టీల్‌ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

గండి పడిందా? పెట్టారా?

ౄ ‘పోలవరం కాల్వ’పై పరస్పర నిందారోపణలు
ౄ దర్యాప్తు నత్తనడకపై ప్రతిపక్షం విమర్శలు

నూజివీడు, ఆగస్టు 7: గోదావరి- కృష్ణా నదులను అనుసంధానం చేస్తున్న పోలవరం కాల్వకు పడిన గండిపై విచిత్ర వాదనలు వినిపిస్తున్నాయి. కాలువకు గండి పడిందా?, లేదా ఎవరైనా గండి పెట్టారా? అనే విషయంపై నాయకులు చేసుకుంటున్న విమర్శలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గండిపడిన ప్రాంతంలోనే జల వనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మకాం వేసి మరీ పనులు నిర్వహించటంపై కూడా రాజకీయ విమర్శలకు బలం చేకూర్చుతోంది. ఈ నెల 1న ఉదయం పోలవరం కాల్వకు గండి పడింది. హుటాహుటిన మంత్రి దేవినేని ఉమ సంఘటన ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. పట్టిసీమ కాలువ ద్వారా విడుదల అవుతున్న గోదావరి జలాలను నిలుపుదల చేయించారు. 24 గంటల్లోగా గండి పూడ్చివేత పనులు పూర్తిచేసి గోదావరి జలాలు యథావిధిగా విడుదల చేస్తామని ప్రకటించారు. గండి విద్రోహుల చర్యగా పేర్కొంటూ పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు నూజివీడు రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరోక్షంగా ప్రతిపక్ష నాయకుల ప్రోద్బలంతోనే గండి పడిందని వారు ఆరోపణలు చేశారు. 24 గంటల్లోనే పనులు పూర్తిచేస్తామని మంత్రి దేవినేని ఉమ హామీ ఇచ్చినప్పటికీ గండి పడి వారం రోజులు అయినప్పటికీ పనులు సాగుతూనే ఉన్నాయి.
ఇదిలావుంటే వైకాపా నాయకుడు, మాజీ మంత్రి కొలుసు పార్థసారథి కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించారు. గండి పెట్టాల్సిన అవసరం ఎవరికో ఎందుకుంటుందని ఆయన ప్రశ్నించారు. గండి పడటంతో గోదావరి జలాలన్నీ రామిలేరు ద్వారా కొల్లేరులోకి వెళ్లాయని, తద్వారా లబ్ధిచేకూరేది తెలుగుదేశం పార్టీ నాయకుల చేపల చెరువులకేనని విమర్శిస్తూ ఆయన రాజకీయ దుమారానికి తెరలేపారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఒక శాసనసభ్యుడు గండి పడిన ముందురోజు పోలవరం కాలువపై పర్యటించారనే విషయాన్ని గుర్తుచేశారు. గండి విషయంలో తెలుగుదేశం నాయకుల పాత్ర లేకపోతే పోలీసు దర్యాప్తు ఎందుకు వేగవంతం చేయలేదని పార్థసారథి ప్రశ్నించారు. పోలవరం కాల్వకు గండి పడలేదని, పెట్టారని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. గండి పడిన ప్రాంతంలో అధికారులను కూడా తెలుగుతమ్ముళ్లు సక్రమంగా పనిచేయనీయటం లేదని, గండి వివరాలను అధికారులను అడుగుతుంటే తెలుగుతమ్ముళ్లు సమాధానం చెబుతున్నారని, ఇదేం పద్ధతి అని మాజీ మంత్రి పార్థసారథి వాపోయారు. గండి అంశాన్ని వైకాపా నాయకులు రాజకీయం చేస్తే నదుల అనుసంధానంతో వచ్చిన మైలేజీ పోతుందని భావించి మంత్రి దేవినేని ఉమ కాలువ వద్దే తిష్ట వేశారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పనుల్లో నాణ్యతకు తిలోదకాలివ్వటం వల్లే ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయని ఇంజనీరింగ్ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

కాల్వకు గండి విషయంలో మంత్రి దేవినేని ఉమ దర్యాప్తును వేగవంతం చేయించి, చిత్తశుద్ధి నిరూపించుకోవాలని పలువురు సూచిస్తున్నారు.

పోలవరం కాల్వకు గండి పడిన పాంతం (ఫైల్ ఫొటో)