ఆంధ్రప్రదేశ్‌

పేదల ఆరోగ్య దీప్తి ఎన్టీఆర్ వైద్యసేవ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 7: పేదల పాలిట సంజీవని.. బడుగు, బలహీన వర్గాల ఆరోగ్య దీప్తి... రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న చంద్రకాంతి ఎన్టీఆర్ వైద్యసేవ. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు అనుగుణంగా ఒక్కొక్క కార్యక్రమాన్ని అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య భద్రతను తమ బాధ్యతగా తీసుకుంది. నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తూ వారి ప్రాణాలను నిలబెడుతోంది. లక్షల్లో ఖర్చయ్యే రోగాలను ఉచితంగా నయం చేస్తూ ఆ కుటుంబాల్లో చిరునవ్వులు విరబూయిస్తోంది.
2014 జూన్ నుంచి నేటి వరకు 17 లక్షల 15వేల 670 మందికి ఉచితంగా వైద్య చికిత్స చేయించింది. వీరిలో 8,73,992 మంది అవుట్ పేషంట్లు కాగా, 8,41,678 మంది ఇన్ పేషంట్లు ఉన్నారు. ముందస్తుగా అనుమతించిన చికిత్సలు 7,59,107 కాగా ఇందుకు అయిన మొత్తం రూ.2,219.231కోట్లు. ఇప్పటివరకు సర్జరీలు పూర్తి చేసినవి 7,48,831. ఇందుకు వెచ్చించిన మొత్తం రూ.2191.489 కోట్లు.
ఇదే సమయంలో 2,03,938 మెడికల్ ప్యాకేజీలకు అనుమతివ్వగా ఇందుకు గాను రూ.458.545 కోట్లు వెచ్చించారు. ఆయా చికిత్సల కోసం వచ్చిన క్లెయిమ్‌లను పరిశీలిస్తే.. 684751 కాగా, క్లెయిమ్‌ల కోసం విడుదల చేసిన మొత్తం రూ.1785.892 కోట్లు. 911 చికిత్సల వైద్యం కోసం ముందస్తుగా అనుమతించిన కేసులు 1,85,864. ఇందుకు వెచ్చించిన మొత్తం రూ.482.545 కోట్లు. 911 జబ్బులకు వైద్య చికిత్స అందించే మొత్తం ప్రభుత్వ ఆసుపత్రుల సంఖ్య 93గా ఉంది.
వివిధ జబ్బులకు సంబంధించి 133 చికిత్సలకు సంబంధించి ముందస్తు అనుమతి తీసుకున్న వాటి సంఖ్య 29939. వైద్యానికి ఆమోదించిన మొత్తం రూ.83.217 కోట్లు. 133 చికిత్సలు అందించే ప్రభుత్వ ఆసుపత్రులు 83గా ఉన్నాయి.
ఓవైపు చికిత్సకు ముందస్తు అనుమతిస్తూ, క్లెయిమ్‌ల సెటిల్మెంట్ చేస్తూనే ఎన్టీఆర్ వైద్యసేవ కింద అనేక పరిష్కారాలు చేయబడ్డాయి.
ఆ కేసుల సంఖ్య 13,114గా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్యసేవ కింద నమోదైన ఆసుపత్రులు మొత్తం 562 కాగా, ప్రైవేట్ ఆసుపత్రులు 409. ప్రభుత్వ ఆసుపత్రులు 153. వాటిలో చికిత్సలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రులు 74 కాగా, ప్రైవేట్ ఆసుపత్రులు 339గా ఉన్నాయి.

‘పోలవరం’ పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం

ౄ నిధుల విదిలింపుతో ఎనే్నళ్లకు పూర్తిచేస్తారు?
ౄ 2018కి పూర్తికావాలంటే ఏటా పదివేల కోట్లివ్వాలి
ౄ పిసిసి ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి

పోలవరం, ఆగస్టు 7: పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని పిసిసి ఉపాధ్యక్షుడు ఎన్ తులసిరెడ్డి ఆరోపించారు. రెండు ప్రభుత్వాలు ఏర్పాటై రెండేళ్లు పూర్తయినా ప్రాజెక్టు నిర్మాణంపట్ల శ్రద్ధ కనపర్చకడపోవడం దురదృష్టకరమన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాన్ని ఆదివారం తులసిరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖర్లతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే సాగు, తాగు అవసరాలు తీరడంతోపాటు, గోదావరి డెల్టా స్థిరీకరణ, విశాఖ పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడుతుందన్నారు. అలాగే 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. 2005లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి రూ.5575 కోట్లు వ్యయంచేశారన్నారు. రాష్ట్ర విభజన సమయంలో సెక్షన్ 90 ద్వారా జాతీయ ప్రాజెక్టుగా గుర్తించిన కేంద్రం ఇప్పటివరకు ప్రాజెక్టు నిర్మాణానికి ఇచ్చింది కేవలం రూ.850 కోట్లేనన్నారు. బడ్జెట్‌లో కేటాయించింది వంద కోట్లు మాత్రమేనన్నారు. సుమారు రూ.35 వేల కోట్లు ఖర్చయ్యే పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తిచేస్తామంటున్న కేంద్ర ప్రభుత్వం ఇలా నిధులు విదిలిస్తే ఎనే్నళ్లకు పూర్తిచేయగలదని తులసిరెడ్డి ప్రశ్నించారు. చెప్పినట్టుగా ప్రాజెక్టును పూర్తిచేయాలంటే ఏటా రూ.10వేల కోట్లు కేటాయించాలన్నారు. ప్రాజెక్టుకు నాబార్డు నుండి రుణం ఇప్పిస్తామని కేంద్రం చెబుతోందని, నిధులు ఎక్కడి నుండి ఇచ్చినా ప్రాజెక్టు పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రంపైనే ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై ఎత్తిపోతల పథకాలు ఏ ప్రయోజనం ఆశించి నిర్మిస్తోందో అర్ధం కావడంలేదన్నారు. ఎత్తిపోతల కంటే గ్రావిటీ ద్వారా నీరు వెళ్లే ప్రాజెక్టులపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని ఆయన సూచించారు. ముందుగా తులసీరెడ్డి పట్టిసం ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించి, పోలవరం స్పిల్ వే వద్దకు చేరుకున్నారు. ఆయనకు ఇరిగేషన్ డిఇ కె బాలకృష్ణ ప్రాజెక్టు వివరాలు తెలియచేశారు. తులసిరెడ్డి వెంట పిసిసి కార్యదర్శి సతీష్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి బివిఆర్ చౌదరి, పశ్చిమ గోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రఫీయుల్లాబేగ్, నేతలు కొణతాల ప్రసాద్, పోసిరత్నం తదితరులున్నారు.

పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలిస్తున్న తులసీరెడ్డి