రాష్ట్రీయం

‘ఎమ్సెట్’కేసులో మరో ఇద్దరి అరెస్టు నగదు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: ఎమ్సెట్-2 పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరు బ్రోకర్లను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటికే 8 మంది దళారులను సిఐడి అరెస్టు చేసింది. తాజాగా ప్రశ్నాపత్రాన్ని క్షేత్రస్థాయి దళారులకు అందజేసిన వారిని అరెస్టు చేయడంతో ఇంత వరకూ ఈ కేసులో అరెస్టయిన వారి సంఖ్య 10కి పెరిగింది. ఈ కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన సునీల్ సింగ్, ఖలీల్‌తో పాటు మరో ముగ్గుర్ని సిఐడి ఇప్పటికే అదుపులోకి తీసుకుంది. వీరిని విచారించి వెల్లడైన అంశాల ఆధారంగా ప్రశ్నాపత్రాన్ని బయటకు తెచ్చి ఈ కుట్రలో ప్రముఖ పాత్ర పోషించిన వారి కోసం గాలింపు చర్యలను సిఐడి ప్రారంభించింది. నాలుగైదు రోజుల్లో మరికొంత మందిని పట్టుకునే అవకాశం ఉందని తెలిసింది.
రాంచీకి చెందిన శ్యామ్ యాదవ్ అలియాస్ గుడ్డూను, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సంస్థలో రీసెర్చ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న రామకృష్ణను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ముంబయిలో క్యాంప్ నిర్వహించిన నిషాద్, మయాంక సింగ్‌లకు శ్యామ్ యాదవ్ బ్రోకర్‌గా పనిచేశాడు. ఎనిమిది మంది విద్యార్థులను ముంబయి శిబిరానికి తరలించి 60 లక్షలు శ్యామ్ యాదవ్ వసూలు చేశాడు. 50 లక్షల రూపాయలు శ్యామ్ యాదవ్ మయాంక్ సింగ్‌కు ఇచ్చాడని పోలీసులు ఆరోపిస్తున్నారు. ముంబయికి చెందిన గుడ్డూ ప్రధాన నిందితుడు మయాంక్ సింగ్‌కు అనుచరుడని, ముంబయిలో 8 మంది విద్యార్థులతో శిబిరం నిర్వహించాడని సమాచారం. కాగా రామకృష్ణ సైతం షిర్డీలో శిబిరం నిర్వహించినట్టు పోలీసులు చెబుతున్నారు. వీరిని అరెస్టు చేసిన పోలీసులు లక్షలాది రూపాయలను స్వాధీనం చేసుకున్నట్టు తెలిసింది.