రాష్ట్రీయం

తుమ్మడిహెట్టికి తొలగిన అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, ఆగస్టు 8: తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దుల్లోని ప్రాణహిత నదిపై తుమ్మడిహెట్టి వద్ద 148 మీటర్ల ఎత్తున నిర్మించే బ్యారేజీ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వసన్నద్ధమవుతోంది. రీడిజైనింగ్‌తో తలపెట్టిన ప్రాణహిత తుమ్మడిహెట్టి బ్యారేజీ నిర్మాణం వల్ల తమకు ఎలాంటి అభ్యంతరం లేదని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే సూత్రప్రాయంగా అంగీకరించడంతో ఈనెలలోనే అక్కడి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కీలక ఒప్పందం కుదుర్చుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా సన్నాహాలు సాగిస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రాణహిత నది ఉరకలవేస్తూ ఉధృతంగా ప్రవహిస్తూ వరద నీరు సముద్రంలో వృథాగా కలిసిపోతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలకు సమాయత్తమవుతోంది. తుమ్మడిహెట్టి వద్ద నిర్మించే బ్యారేజీతో ఎలాంటి అనర్థాలు లేవని మహారాష్ట్ర తేల్చిచెప్పినా క్షేత్రస్థాయిలో పర్యావరణ అనుమతులపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ ఇరిగేషన్ అధికారులను ఆదేశించడంతో ఇందుకోసం ప్రత్యేకంగా పర్యావరణ పరిరక్షణ ఆధ్యయన కేంద్రం ఉన్నత స్థాయి బృందం సోమవారం ప్రాజెక్టు నిర్మాణ స్థలాన్ని, వరద ఉధృతి, ముంపు తదితర అంశాలను సర్వే చేసింది. పర్యావరణ ఆధ్యయన కేంద్రం సీనియర్ సైంటిస్టు పివి ఆర్ సురేంద్ర, ప్రాజెక్టు మేనేజర్ నర్సింగ్‌తోపాటు ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంచంద్ర, డిఈ శ్రీనివాస్‌రావు అధ్వర్యంలో తుమ్మడిహెట్టి పరిసర గ్రామాలను పరిశీలించి రైతులు, నాటుపడవ కూలీల నుండి వివరాలు సేకరించారు. అక్కడ సాగవుతున్న పంటలు, భౌగోళిక పరిస్థితుల గురించి బృందం ఆరా తీసింది. ఈనెల 12న ఢిల్లీలోజరిగే జాతీయ స్థాయి పర్యావరణ సదస్సులో వివిధ రాష్ట్రాల్లో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతి గురించి, పర్యావరణ అనుమతులపై సర్వే నివేదికలను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోనున్నారు. సోమవారం ప్రాణహిత తీరంలోని కౌటాల మండలంలో పర్యటించిన సర్వే బృందం రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో నదీ ప్రవాహం, నీటి లభ్యత, వర్షాకాలంలో వృథాగా పోయే వరదనీరు, ప్రాణహిత ఆవల మహారాష్ట్ర సరిహద్దులోని గ్రామాల స్థితిగతులు, ముంపు అంశాలను పరిశీలించారు. 152 మీటర్ల నుండి 148 మీటర్లకు తగ్గించడం ద్వారా మహారాష్టక్రు ఎలాంటి ముప్పు, ముంపు లేదని నిర్ధారించడంతో అధికారుల బృందం పర్యావరణ కన్సల్టెన్సీ సర్వే బృందంతో అన్ని కోణాల్లో సమగ్ర సర్వే నివేదించారు. బ్యారేజీ పరిసరాల్లో, నిర్మాణ ప్రదేశంలో ఛాయచిత్రాలు, వీడియో ఫుటేజీలు సేకరించారు. 12న ఢిల్లీలో జరిగే జాతీయ పర్యావరణ సదస్సులో సమగ్ర నివేదిక సమర్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఇరు రాష్ట్రాలకు పర్యావరణ అనుమతులు జారీ చేయనుంది. ఇదిలా ఉంటే ఇది వరకే తుమ్మడిహెట్టి ప్రాజెక్టుకోసం 8 అనుమతులకు లైన్‌క్లియర్ కావడం గమనార్హం. ఉన్నతస్థాయి అధికారుల బృందం పర్యావరణ సర్వేలో భాగంగా మంగళవారం మహారాష్ట్ర సరిహద్దులో గల గడ్చిరోలి జిల్లా ప్రాణహిత తీరంలోని కుంగడ్‌మహాల్, చెప్రాల, శివుని, అనుకోడ గ్రామాలను సందర్శించి, మరిన్ని వివరాలు సేకర్ఘించనున్నారు.
ప్రాణహిత కోసం కౌటాలలో ప్రత్యేక కార్యాలయం
రెండు లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాణహిత తుమ్మడిహెట్టి బ్యారేజీ నిర్మాణ పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ఇరిగేషన్ శాఖ ప్రస్తుతం బెల్లంపల్లిలో ఉన్న డిఈ కార్యాలయాన్ని కౌటాల కేంద్రానికి మళ్ళించాలని నిర్ణయించింది. ఇద్దరు డిఈలతో పాటు నలుగురు ఏ ఈల హోదాతో ప్రత్యేక కార్యాలయాన్ని కౌటాలలో ఏర్పాటు చేసి నాలుగేళ్ళలో ప్రాజెక్టు పూర్తిచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే బ్యారేజీ నిర్మాణానికి 1230 కోట్ల వ్యయంతో 103 గేట్లు నిర్మించి ఎత్తిపోతల ద్వారా 20 టిఎంసిల నీటిని సాగుభూములకు అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. అయితే ఈ వర్షాకాలంలో వరదలు ఉప్పొంగుతున్న నేపథ్యంలో ప్రాణహిత నది ద్వారా సగటున ఒక సెకన్‌కు 62 వేల క్యూబిక్ మీటర్లు, రోజుకు 187 టిఎంసీల జలాలు వృదాగా సముద్రంలో కలుస్తున్నట్లు ఇరిగేషన్ నిపుణులు అంచనా వేశారు.

చిత్రం.. తుమ్మడిహెట్టి వద్ద సోమవారం ప్రాణహిత వరద ప్రవాహాన్ని ఫొటోలో బంధిస్తున్న అధికారులు