రాష్ట్రీయం

దూబగుంట రోశమ్మకు కన్నీటి వీడ్కోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కలిగిరి, ఆగస్టు 8: సారా ఉద్యమాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి రాష్ట్రంలో సంపూర్ణంగా మద్యాన్ని నిషేధించేలా చేసిన ఉద్యమ నేత వర్దినేని రోశమ్మ అంతిమయాత్ర అశ్రునయనాలతో స్వగ్రామమైన దూబగుంటలో సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. బంధువులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు, గ్రామస్తుల నడుమ అంతిమయాత్రను నిర్వహించారు. రోశమ్మ మృతదేహాన్ని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ దూతగా కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోమవారం అంతిమయాత్రలో పాల్గొని రోశమ్మకు నివాళులు అర్పించారు. స్వయంగా బాలకృష్ణ ఫోన్ చేసి రోశమ్మ కుటుంబీకులకు సంతాపాన్ని తెలియచేశారు. బాలకృష్ణ తరపున 50వేల రూపాయల నగదును రోశమ్మ కుటుంబానికి అందచేశారు. పార్టీ పరంగా కుటుంబాన్ని ఆదుకుంటామని బాలకృష్ణ చెప్పినట్లు సమాచారం. ఉదయగిరి మాజీ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి రోశమ్మ మృతదేహం వద్ద నివాళులు అర్పించి, ఆమె కుటుంబానికి సానుభూతి తెలిపారు. అలాగే మెట్టుకూరు చిరంజీవిరెడ్డి రోశమ్మ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పలువురు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. మద్య నిషేధ ఉద్యమ నేత దూబగుంట రోశమ్మ అంతిమయాత్ర