రాష్ట్రీయం

టమోటా కిలో రూ.2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 8: టమోటా ధర ఒక్కసారిగా పడిపోయింది. కిలో టమోటా ధర రూ.2కు పడిపోవడంతో సోమవారం అనంతపురంలో రైతులు ఆందోళనకు దిగారు. జాతీయరహదారిపై టమోటాలు పారబోసి నిరసన తెలిపారు. నగరంలోని కక్కలపల్లి వద్ద ఉన్న టమోటా మార్కెట్‌కు సోమవారం పది టన్నుల టమోటా వచ్చింది. దీంతో ధర అమాంతం పడిపోయింది. 15 కేజీల ట్రే ధర రూ.30 లోపే పలికింది. అంతకు మించి కొనడానికి వ్యాపారులు విముఖత వ్యక్తం చేశారు. ధర అమాంతం పడిపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళారుల కమీషన్ పోను కిలోపై కనీసం రూపాయి కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళారుల దోపిడీని అరికట్టాలని, గిట్టుబాటు ధర కల్పించాలంటూ రైతులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. టమోటాలను రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. దీంతో గంటన్నర పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

చిత్రం.. అనంతపురం శివారులో జాతీయ రహదారిపై టమోటాలు
పారబోసి నిరసన తెలుపుతున్న రైతులు