రాష్ట్రీయం

పోరాటం ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఆగస్టు 8: ప్రత్యేక హోదా విషయంలో రాజీలేని పోరాటం చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. సోమవారం తన సొంత నియోజకవర్గం కుప్పంలో జరిగిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. రాష్ట్ర విభజన హేతుబద్ధంగా జరగలేదని, దానివల్ల అనేక అనర్థాలు తలెత్తాయని చెప్పారు. విభజన అనంతరం రాష్ట్రం ఆర్థికంగా చితికిపోవడంతోపాటు రాజధాని లేని రాష్ట్రంగా నిలిచిందన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కూడా జరుపుకోలేని పరిస్థితి నెలకొందన్నారు. అయితే రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, వైకాపా కుట్ర చేస్తున్నట్లు ఆరోపించారు. రాష్ట్రంలో 26శాతం మాత్రమే చెట్లు ఉన్నాయని దీనిని యాభై శాతం పెంచడమే తమ లక్ష్యమన్నారు. ప్రతి విద్యార్థి మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే రెండు గ్రేస్ మార్కులు ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఉద్యోగులకు బదిలీల ప్రాధాన్యత పాటు ఇంక్రిమెంట్ ఇచ్చే విషయంలో కూడా పరిశీలిస్తున్నామన్నారు. కృష్ణా పుష్కరాల్లో అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. నేడు రాష్ట్రానికి ఆధునిక పరిజ్ఞానం అవసరమని, రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి అన్ని శాఖల పనితీరును పర్యవేక్షించడంతో పాటు శాంతి భద్రతలకు, అభివృద్ధి కార్యక్రమాలకు కూడా ఈ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నట్లు తెలిపారు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలన్నదే తమ ధ్యేయమన్నారు.
రెండురోజుల్లో డ్వాక్రా సంఘాలకు రుణమాఫీ
రెండు రోజుల్లో డ్వాక్రా సంఘాలకు రెండో విడత రుణమాఫీని బ్యాంకు ఖాతాలో జమ చేస్తామన్నారు. గతంలో ఈ రుణమాఫీ విషయంలో కొన్ని అవరోధాలు ఏర్పడ్డాయని ప్రస్తుతం రెండో విడత రుణమాఫీ విషయంలో సంఘ సభ్యులు సేఫ్‌గా డబ్బును వినియోగించుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. అసంఘటిత కార్మిక సంఘాలకు ఐదు లక్షల బీమా కల్పించిన ఘనత ఈ ప్రభుత్వానిదే అన్నారు. గోదావరి, కృష్ణ నదులను కలిపి రికార్డును సృష్టించామన్నారు. ఇకపై ఆర్టీసీ ఆస్తులను ధ్వంసం చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. అంగన్‌వాడి కేంద్రాలకు కూడా అధునాతన భవనాలు ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి అంగన్‌వాడి టీచరుకు ట్యాబ్ ఇవ్వనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో పాడిపరిశ్రమకు పెద్ద పీట వేస్తున్నామని ఇందులో భాగంగానే ప్రతి పాడి రైతుకు యాబై శాతం సబ్సీడితో దాణా అందించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.

చిత్రం.. సోమవారం కుప్పంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్లొని ప్రసంగిస్తున్న సిఎం