రాష్ట్రీయం

2017 జూన్ 2

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: స్థానికతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. 2017 జూన్ 2వ తేదీలోగా ఎపికి వచ్చిన వారికి స్థానికత వర్తింప చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొంది. కేవలం తెలంగాణ నుండి ఎపికి వచ్చిన వారికి మాత్రమే స్థానికత వర్తిస్తుందని కూడా స్పష్టం చేసింది. స్థానికత ధ్రువీకరణ పత్రాలు కావలసినవారు మూడు ఫారాలతో దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన చిరునామా స్వీయ ధ్రువీకరణ, స్థానికత అంశాలపై దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లో ధ్రువీకరణ పత్రం జారీ చేస్తామని పేర్కొంది. ఎపిలో ‘మీ సేవా’ సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చని కూడా సూచించింది. ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేవారికి స్థానికత అంశంపై రాష్టప్రతి ఇప్పటికే ఆమోదముద్ర వేశారు. ఈమేరకు కేంద్రం గెజిట్ నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేసింది. రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలో ఎపికి తిరిగి వచ్చే వారికి
స్థానికత వర్తిస్తుందని నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. అంటే 2017 జూన్ 2వ తేదీలోగా ఆంధ్రాకు వచ్చిన వారందరినీ స్థానికులుగా గుర్తించాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఏపికి వెళ్లే ఉద్యోగులకు ఆ రాష్ట్రంలో స్థానికత కల్పిస్తూ కేంద్రం ఆమోదించడాన్ని తెలంగాణ ఉద్యోగ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఈ ఉత్తర్వులవల్ల ఉద్యోగులు ఎపికి వెళ్లి అక్కడ స్థానికులు అవుతారని, మరోవైపు వారి పిల్లలు తెలంగాణలో చదివి ఉన్నందున తెలంగాణలో స్థానికులు అవుతారని, ఇదెలా కుదురుతుందని సంఘాల నేతలు పేర్కొంటున్నారు.