రాష్ట్రీయం

ఇదీ భూసేకరణ పాలసీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 8: భూసేకరణకు సమగ్ర విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలంగాణ ప్రభుత్వం సోమవారం హైకోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసింది. రైతుల నుంచి నేరుగా భూములు కొనుగోలు చేసేందుకు ఉద్దేశిస్తూ సర్కరు జారీ చేసిన జీవో 123ను కొట్టివేస్తూ హైకోర్టు బుధవారం తీర్పు ఇచ్చిన దరిమిలా ప్రభుత్వం రైతుల పునరావాసానికి సంబంధించి తీసుకున్న చర్యలను సోమవారం హైకోర్టుకు వివరించింది. ఏక సభ్య న్యాయమూర్తి జీవో 123 ను కొట్టి వేస్తూ ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో సవాలు చేసింది. రివిజన్ పిటీషన్‌ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాధన్, జస్టిస్ యు దర్గా ప్రసాదరావులతో కూడిన డివిజన్ బెంచ్ సోమవారం విచారణ జరిపింది. పిటీషన్ విచారణ సందర్భంగా రైతుల పునారావాసానికి తీసుకోబోతున్న చర్యలు ఏమిటో వివరించాలని బెంచ్ పేర్కొంది. దాంతో ప్రభుత్వం ఒక అఫిడవిట్‌ను దాఖలు చేసింది. పునరావాస చట్టంలో పేర్కొన్నదానికంటే అధికంగానే పరిహారం చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అడ్వకేట్ జనరల్ కె. రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయితే పిటీషనర్ల తరఫున హాజరైన న్యాయవాది వేదుల వెంకటరమణ విన్నపం మేరకు విచారణను హైకోర్టు మంగళవారానికి
వాయిదా వేసింది.
రైతులకు మెరుగైన నష్టపరిహారాన్ని పునరావాస సదుపాయాలు కల్పిస్తున్నట్టు రాష్ట్రప్రభుత్వం పేర్కొంది. ఇందిరా ఆవాస్ యోజన పథకం కింద రెండు బెడ్‌రూమ్‌ల ఇల్లు లేదా 5.04 లక్షల రూపాయిలను రైతులకు అందజేయాలని నిర్ణయించిందని, భార్య లేదా భర్త లేని వ్యక్తులకు 1.25 లక్షల రూపాయిల చెల్లించడం జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. ఎస్సీ, ఎస్టీలకు 20 ఏళ్ల కాలవ్యవధికి నెలకు 3వేల రూపాయిలను చెల్లించనున్నామని, ఇతర చేతివృత్తులు, వ్యవసాయ కార్మికులకు నెలకు 2500 రూపాయిలు చొప్పున 20 ఏళ్లు ఇస్తామని, 40వేల రూపాయిలు గ్రాంట్‌గా అందిస్తారని, అదే ఎస్సీ, ఎస్టీలకు 60వేల రూపాయిలు గ్రాంట్‌గా ఇస్తామని పేర్కొంది. 60 వేల రూపాయిలు రవాణా చార్జీలుగా ఇస్తామని, రీ సెటిల్‌మెంట్‌కు మరో 60 వేల రూపాయిలు ఇస్తామని రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు వివరించింది.
ప్రాజెక్టుల నిర్మాణానికి భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్రప్రభుత్వం 2015 జూలై 30వ తేదీన జీవో జారీ చేసిన విషయం విదితమే. ఈ జీవో వల్ల రైతులు, ఈ భూములను సేకరించే శాఖల మధ్య ఒప్పందం కుదిరేందుకు, రైతుల నుంచి ప్రభుత్వ శాఖలు నేరుగా భూములు సేకరించేందుకు వీలవుతుంది. మెదక్ జిల్లా జరాసంగం మండలం బర్దీపూర్ గ్రామానికి చెందిన తుక్కమ్మ మరో 22 మంది రైతు కూలీలు ఈ జీవోను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు జడ్జి జస్టిస్ సురేష్ కుమార్ ఖైత్ విచారించారు. ప్రభుత్వం ప్రైవేట్ భూములను కొనుగోలు చేసేందుకు డీలర్‌గా వ్యవహరించడం సరికాదంటూ, జీవో 123ను సవాలు చేస్తూ బాధితులు పిటిషన్‌ను దాఖలు చేశారు. తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల వౌలిక సదుపాయాల సంస్ధ ద్వారా తమ ప్రాంతంలో నేషషనల్ ఇనె్వస్ట్‌మెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)ను ఏర్పాటు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం జీవో 123 ద్వారా భూములను సేకరిస్తోందని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. తమ భూములను ప్రభుత్వం తీసుకుంటే, ఎస్సీ వర్గానికి చెందిన తమకు బతుకుతెరువు ఉండదని కోర్టుకు తెలిపారు. తమ భూములను ప్రభుత్వం తీసుకోవడం వల్ల తాము రోడ్డునపడుతామని, ఈ తరహా జీవో ద్వారా తమ భూములను ప్రభుత్వం సేకరించరాదని, తమకు పునరావాసం కల్పించకుండా ఈ జీవో అమలు చేయడం సమ్మతం కాదంటూ వారు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైకోర్టు తీర్పును ఇస్తూ, రాష్ట్రప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం, పునరావాసం, రిసెటిల్‌మెంట్, తగిన నష్టపరిహారం చెల్లింపు విధానాన్ని పక్కనపెట్టి జీవో 123ను జారీ చేయడం సరికాదని పేర్కొంది.