రాష్ట్రీయం

కృష్ణా డెల్టాకు నీరు విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునసాగర్, ఆగస్టు 8: నాగార్జునసాగర్ జలాశయం నుండి ప్రధాన జల విద్యుత్ కేంద్రంద్వారా సోమవారం కృష్ణాడెల్టాకు జెన్‌కో అధికారులు నీటిని విడుదల చేశారు.
ఈ సందర్భంగా జెన్‌కో ఎస్‌ఇ రాజనర్సయ్య మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రకాశం బ్యారేజివద్ద నీటిమట్టాన్ని పెంచడానికి రోజుకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామని, ఈ నెల 16 వరకు నీటి విడుదల కొనసాగుతుందని ఆయన తెలిపారు. సుమారు 5 టిఎంసిల మేరకు నీటివిడుదల చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి 10,983 క్యూసెక్కుల నీరు వస్తుండగా కుడికాల్వ ద్వారా 4,679 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు.

చిత్రం.. విద్యుత్ కేంద్రం నుండి కృష్ణాడెల్టాకు విడుదలవుతున్న నీరు