రాష్ట్రీయం

ఆన్‌లైన్ అడ్మిషన్లలో గందరగోళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 9: ఇంజనీరింగ్‌లోనూ, డిగ్రీ, పిజి కాలేజీల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు విద్యార్థులను ముప్పుతిప్పలు పెట్టాయి. ప్రభుత్వం ఇంజనీరింగ్ అడ్మిషన్లకు సంబంధించి సమగ్రమైన వివరణాత్మక మార్గదర్శకాలను జారీ చేయకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. వెబ్ ఆప్షన్లు ఇవ్వడంలో ఉన్న సాంకేతిక కిటుకుపై అవగాహన లేకపోవడంతో తమకు రావల్సిన సీట్లు కూడా రాక చాలా మంది ఇబ్బంది పడగా, రెండో దశ కౌనె్సలింగ్‌లో ఉన్న సీటును కూడా కోల్పోయిన విద్యార్థులు వందలాది మంది ఉన్నారు. మొదటి దశ కౌనె్సలింగ్‌లో సీటు పొంది, ఫీజు సైతం చెల్లించి, రెండో దశ కౌనె్సలింగ్‌కు దరఖాస్తు చేసి మంచి కాలేజీలో సీటు వస్తుందని ఎదురుచూసిన విద్యార్థులు రెండు దశల్లో సీట్లు కోల్పోయారు. దీనంతటికీ కారణం వెబ్ ఆప్షన్లు ఇవ్వడంలో విద్యార్థులు సాంకేతిక అంశాలను పరిగణనలోకి తీసుకోకపోవడమేనేది సుస్పష్టం. విద్యార్థులు వెబ్‌ఆప్షన్లు ఇవ్వడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అధికారులు సరైన సూచనలు చేయకపోవడంతో ఈ సమస్య ఎదురైంది. మొదటి రెండు దశల కౌనె్సలింగ్ పూర్తయిన తర్వాత కన్వీనర్ కోటాలో 15వేలకు పైగా సీట్లు మిగిలిపోయాయి. యాజమాన్య కోటాలో మరో 30వేల సీట్లు మిగిలాయి. ప్రస్తుతం కన్వీనర్ కోటాకు స్పాట్ అడ్మిషన్లు జరుగుతున్నాయి. స్పాట్ అడ్మిషన్లకు పోవాలంటే గతంలో విద్యార్థులు ఎక్కడా చేరి ఉండరాదనే నిబంధనలను యాజమాన్యాలు పెడుతున్నాయి. ఎక్కడో ఒక చోట చేరిన విద్యార్థులకు స్పాట్ అడ్మిషన్లలో సీటు పొందడం గగనమైపోయింది. ఇదే దురవస్థ డిగ్రీలోనూ, పిజి కోర్సుల్లోనూ విద్యార్థులు ఎదుర్కొన్నారు. 4 లక్షల సీట్లు డిగ్రీలో ఉండగా, కేవలం లక్షన్నర మంది మాత్రమే వివిధ కోర్సుల్లో చేరారు. దాదాపు మూడు లక్షల సీట్లు మిగిలిపోయాయి. కాలేజీల్లో సీట్లు భర్తీ కాలేదని యాజమాన్యాలు చెబుతుండగా, ఆన్‌లైన్‌లో మాత్రం విద్యార్థులకు ఆయా సీట్లు దక్కలేదు. దీనికి కారణం అడ్మిషన్ల సాఫ్ట్‌వేర్‌లో ఉన్న లోపాలేనని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కోఠీ మహిళా కళాశాలలో వివిధ బ్రాంచిలలో సీట్లు భర్తీ కాకుండా ఖాళీగా ఉన్నా, ఆయా సీట్లు కావాలని దరఖాస్తు చేసిన వారికి మాత్రం నిరుత్సాహమే ఎదురైంది. అదే పరిస్థితి ఉస్మానియా యూనివర్శిటీ నిర్వహించిన పిజి అడ్మిషన్లలోనూ జరిగింది. ఏఏ కాలేజీల్లో ఏఏ బ్రాంచిలు ఉన్నాయో, ఎన్ని సీట్లు ఉన్నాయో వంటి వివరాలు అందించకుండానే ఉస్మానియా యూనివర్శిటీ అడ్మిషన్లు నిర్వహించడంతో విద్యార్థులు తాము కోరుకున్నది ఒకటైతే జరిగింది మరొకటైంది. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు విద్యార్థులు సీటు వచ్చిందని భావించి నెట్ ద్వారా ఫీజులను చెల్లించడంతో అవి అటు కాలేజీకి చేరక, ఇటు తమకు అందక అయోమయంలో పడ్డారు. అడ్మిషన్ ఫీజుతో పాటు ఆయా కాలేజీల ట్యూషన్ ఫీజులు, కాషన్ డిపాజిట్లు చెల్లించిన విద్యార్ధులు అవి ఏం అవుతాయో చెప్పేవారు కూడా కరవయ్యారు. దీంతో ఎటూ తేల్చుకోలేక గాలిలో ఉన్న విద్యార్ధులకు సరైన అవకాశాన్ని కన్వీనర్ కల్పించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.