ఆంధ్రప్రదేశ్‌

నా జీవితం ధన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 12: 144 ఏళ్లకు వచ్చిన గోదావరి మహా పుష్కరాలు, 12ఏళ్లకు వచ్చిన కృష్ణా పుష్కరాలకు సరిగ్గా ఏడాది కాలంలో స్వాగతం పలికిన అరుదైన అవకాశం లభించటంతో తన జీవితం ధన్యమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు సంతోషం వ్యక్తపర్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇలాంటి అవకాశం వచ్చి ఉండకపోవచ్చన్నారు. మహాసంకల్పంతో ముందెన్నడూ లేనివిధంగా ఇక శాశ్వతంగా జరిగేలా గోదావరి నదిలో నిత్యం అఖండ హారతి, కృష్ణానదిలో పవిత్ర హారతికి శ్రీకారం చుట్టటం అంటే జీవనాడి గోదావరి, ప్రాణనాడి కృష్ణాకు మనసారా ప్రార్థించి కృతజ్ఞతలు తెలుపుకోవటమే అవుతుందన్నారు. కనీసం ఈ 12రోజులు దేశ, విదేశాల్లో వున్న మనవారంతా టీవీల్లో పవిత్ర హారతిని తప్పనిసరిగా చూసి అన్ని సమస్యలూ పోవాలనీ, ఇంటింటా వెలుగులు రావాలని, మానవ జీవితంలో కష్టాలు తొలగిపోవాలని కోరుకోవాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన హామీలన్నింటినీ కేంద్రం నెరవేర్చాలని కూడా కోరుకుంటూ తాను ప్రార్థించానని చెప్పారు. ప్రత్యేక హోదా మన హక్కు అని ఈసందర్భంగా ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం ఉదయం విజయవాడ దుర్గాఘాట్‌లో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం అచరించి కృష్ణా పుష్కరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో ఉత్సాహంగా మాట్లాడారు. దాదాపు 800 కి.మీ.ల పొడవునా ప్రవహిస్తూ కులమత, ప్రాంతాలకు అతీతంగా కోట్లాది మందికి అన్ని అవసరాలు తీరుస్తూ పరవళ్లు తొక్కుతున్న కృష్ణానదికి ఇటీవలి కాలంలో నీరురాక తల్లడిల్లుతున్న స్థితిలో గోదావరి జలాలను అనుసంధానం చేసి ఈప్రాంత ప్రజల బంగారు భవిష్యత్‌ను తీర్చిదిద్దుతున్నామని చంద్రబాబు అన్నారు. ఈ రాష్ట్రానికి భగవంతుడు ఇచ్చిన రెండు వరాల్లో ఒకటి గోదావరి, రెండోది కృష్ణ అని ఆయన వ్యాఖ్యానించారు. నిన్ననే గోదావరి అంత్య పుష్కరాలు ముగియగా, కృష్ణా పుష్కరాలు ప్రారంభమయ్యాయని, ఈ రెండేళ్లపాటు దేవతలంతా ఇక్కడికే వున్నట్లు భావిస్తున్నామన్నారు. ఆ దేవతలంతా శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్‌లోనే కొలువై ఉండాలంటూ మనమంతా పవిత్రమైన భావనతో నదులను పూజించాలని భక్తులను ఆయన కోరారు. ‘నదుల అనుసంధానాన్ని కొందరు హేళన చేశారు. అనేక విధాలుగా అడ్డుపడ్డారు. రైతులను రెచ్చగొట్టారు. అయినా ఏమైంది? పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు కృష్ణాడెల్టాను సస్యశ్యామలం చేస్తున్నాయి. రాజధాని అమరావతి నగర నిర్మాణానికీ అవే శక్తులు అడ్డంకులు సృష్టించినా రైతులు సహకరించారు. ఇక విజయవాడ నగరాన్ని ఇంతకాలం భ్రష్టు పట్టించారు. బందరు రోడ్డు, జాతీయ రహదారి మినహా మరో దారిలేక ట్రాఫిక్ చక్రబంధనంలో తల్లడిల్లుతుండటాన్ని చూసి దేశ విదేశీయులందరినీ ఆకట్టుకునేలా అభివృద్ధి చేసేందుకు ఆక్రమణలు, కొన్ని చిన్న ఆలయాలు, కొందరు నేతల విగ్రహాలను తొలగించాల్సి వచ్చింది. ఒక దశలో నేను కూడా బాధపడ్డా. అయితేనేమి పవిత్ర సంకల్పంతో ఓ ఆశయం, ఓ మంచిపని కోసం చేయక తప్పలేదు’ అని చంద్రబాబు వివరించారు.
కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా ఈ రాష్ట్రాన్ని చీల్చినా సంకల్ప బలంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఉదాహరణకు విశాఖ ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన హుదూద్ తుఫాన్‌ను ఎదుర్కోగలిగామన్నారు. అదే విశాఖలో వరుసగా రెండోసారి కూడా పారిశ్రామికవేత్తలతో జాతీయ సదస్సు నిర్వహించబోతున్నామన్నారు. రాయలసీమను రతనాలసీమగా తీర్చిదిద్దేందుకు నదుల అనుసంధానం ఉపయోగపడిందని చెప్పారు. అతి తక్కువ వర్షాభావంతో నిత్యం కరవుతో అల్లాడే రాయలసీమ ప్రాంతాన్ని హార్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నామన్నారు. కడపలో ఇటీవల సేద్యపు నీరందించి ఆప్రాంత రైతుల్లో నూతనోత్సాహం తెచ్చామన్నారు. రెండంకెల వృద్ధిరేటు సాధనకు కృషి చేస్తుమన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందితే దేశం కూడా ప్రగతి సాధిస్తుందనేది తన లక్ష్యమన్నారు. అయితే ఇందులో తాను నిమిత్తమాత్రుడినేనని, సంకల్పబలం వల్ల తాను ఐడియాలను, సానుకూల వాతావరణాన్ని సృష్టించగలుగుతున్నట్లు చంద్రబాబు చెప్పారు.
chitram..
విజయవాడలో విలేఖరులతో మాట్లాడుతున్న చంద్రబాబు