ఆంధ్రప్రదేశ్‌

తొలిరోజు వెలవెల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 12: కృష్ణ పుష్కరాల తొలి రోజు వెలవెలబోయింది. కృష్ణ, గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఒక్క ఘాట్ కూడా భక్తులతో కళకళలాడలేదు. తొలి రోజు భారీగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేశారు. కానీ అధికారుల అంచనాలు తారుమారయ్యాయి. ఎవ్వరూ ఊహించని విధంగా ఘాట్‌లన్నీ ఖాళీగా కనిపించాయి. శుక్రవారం తెల్లవారుజామున కొన్ని ఘాట్‌లలో జనం ఒక మోస్తరుగా కనిపించారు. రానురాను భక్తుల సంఖ్య పెరుగుతుందని అనుకుంటే, పరిస్థితి ఇందుకు భిన్నంగా మారింది. ఏ ఘాట్ చూసినా వెలవెలబోతూ కనిపించింది. విజయవాడలోని దుర్గా ఘాట్‌కు భారీ సంఖ్యలో భక్తుల రావల్సి ఉంది. ఇక్కడ పుష్కర స్నానాలు చేసి, అక్కడి నుంచి నేరుగా అమ్మవారిని దర్శించుకోడానికి భక్తులు వెళతారు. గతంలో ఏ పుష్కరాల్లో లేని విధంగా దుర్గా ఘాట్‌కు భక్తులు రాలేదని అక్కడున్న పురోహితులు చెపుతున్నారు. అలాగే పున్నమి ఘాట్, పద్మావతి ఘాట్, కృష్ణ వేణి ఘాట్‌లో ఏమాత్రం జనం కనిపించకపోవడం గమనార్హం. లక్ష మందికి పైగా ఒకేసారి స్నానం చేసేందుకు వీలుగా పద్మావతి, కృష్ణవేణి ఘాట్‌లను నిర్మించారు. కేవలం పదుల సంఖ్యలో మాత్రమే భక్తులు స్నానాలు ఆచరించారు. గుంటూరు జిల్లా సీతానగరం ఘాట్‌లో ఉదయం తొమ్మిది గంటల వరకూ ఒక మోస్తరు జనం ఉన్నారు. ఆ తరువాత ఘాట్ మొత్తం ఖాళీ అయిపోయింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన పవిత్ర నదీసంగమం వద్ద అతి కొద్దిమంది భక్తులు మాత్రమే స్నానం చేయడం గమనార్హం. ఇలా ఏ ఘాట్‌లో కూడా భక్తులు కనిపించలేదు.
ఈ పరిస్థితికి ప్రధాన కారణం శ్రావణ శుక్రవారం. శ్రావణ శుక్రవారం రోజున మహిళలు ఇళ్ళలో లక్ష్మీ దేవి పూజ చేసుకుంటారు. ఇంట్లోనే బంధువులతో గడుపుతారు. అందువలన మహిళలు పుష్కర స్నానాలకు రాలేదు. మరోపక్క గోదావరి పుష్కరాల సందర్భంగా తొలి రోజు తొక్కిసలాటలో పదుల సంఖ్యలో చనిపోయిన సంగతి తెలిసిందే. మరోపక్క విజయవాడలో ఏర్పాట్లపై ప్రజల్లో అనుమానం ఉండడంతో ఇతర ప్రాంతాల నుంచి భక్తులు రాలేదని చెపుతున్నారు. అంతేకాకుండా కృష్ణ నదిలో గోదావరి జలాలు కలిసినందువలన విజయవాడులో పుష్కర స్నానాలు చేయడానికి ఇష్టపడక కొంతమంది రాలేదని చెపుతున్నారు.
తొలి రోజు పిండ ప్రదానాలు పెద్దగా జరగలేదు. కొద్దిమంది మాత్రమే పిండ ప్రదానాలు చేశారు. కాగా, చాలా ఘాట్‌లలో జనం లేకపోవడానికి పోలీసుల ఆంక్షలే కారణమని తెలుస్తోంది.
ఈ మూడు రోజులే ముఖ్యం
ఇదిలా ఉండగా రానున్న మూడు రోజుల్లో పుష్కరాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. శనివారం సెకెండ్ సాటర్‌డే, ఆదివారం, సోమవారం ఆగస్ట్ 15 కావడంతో వరుసగా మూడు రోజులు సెలవలు వచ్చాయి. దీంతో భారీ సంఖ్యలో భక్తులు పుష్కరాలకు తరలి వస్తారని చెపుతున్నారు.