ఆంధ్రప్రదేశ్‌

నిధులిస్తేనే జాతీయ సంస్థలకు జవసత్వాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 14: కొత్త రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఉన్నత విద్యా సంస్థ లు పూర్తిస్థాయిలో పని చేయడానికి అవసరమైన నిధులను సత్వరం సమకూర్చాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్‌ను కోరా రు. విభజన హామీల్లో భాగంగా ఎపిలో కొన్న ప్రతిష్ఠాత్మక జాతీయ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారని, కొన్ని సంస్థలకు నిధులు ఇచ్చారని, మిగిలిన వాటికి కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలని సిఎం విజ్ఞప్తి చేశారు. కృష్ణ పుష్కర స్నానానికి ఆదివారం విజయవాడకు వచ్చిన మంత్రి జవడేకర్, ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయ్యారు. విద్యా రంగంలో తీసుకున్న సంస్కరణల గురించి చంద్రబాబు జవడేకర్‌కు వివరించారు. ప్రతి తరగతి గదిని ఎలక్ట్రానిక్ క్లాస్ రూంగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని అన్నారు. తరగతి గదుల్లో నేర్చుకున్న విద్యను క్షేత్ర స్థాయి పరీక్షలు, పరిశోధనలకు అనుసంధానం చేస్తున్నామని ఆయన తెలియచేశారు. దీన్ని ప్రోత్సహించేందుకు క్షేత్ర స్థాయి కార్యక్రమాలకు అదనపు మార్కులు ఇస్తున్నామని ఆయన తెలిపారు. పాఠశాల స్థాయి నుంచే ఇన్నోవేషన్ సొసైటీని ప్రవేశపెట్టాలనే తన ఆకాంక్షను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి తెలియచేశారు. ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్, స్టార్టప్స్ కార్యక్రమాలను పాఠశాల దశ నుంచే ఆరంభిస్తే విద్యార్థుల కెరియర్ అత్యున్న స్థాయికి ఎదుగుతుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి జవడేకర్ మాట్లాడుతూ దేశంలో ఉన్నత విద్యకు పెద్ద పీట వేస్తున్నామని అన్నారు. ఏపిలో ఏర్పాటు చేస్తున్న అన్ని ఉన్నత విద్యా సంస్థలకు తగిన నిధులు అందిస్తామని చెప్పారు. విద్యా సంస్థల్లో పరిశోధనలకు పరిశ్రమలు ఆర్థిక సహకారాన్ని అందించాలని అన్నారు. పరిశ్రమలు, ప్రభుత్వం పూనుకుంటే మన తరగతి గదులే శాస్త్ర పరిశోధనలకు పునాదులుగా మారుతాయని జవడేకర్ అభిప్రాయపడ్డారు. ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ తదితర అంశాలపై కేంద్ర మానవవనరుల శాఖ దృష్టి సారించాలని ముఖ్యమంత్రిఈ సందర్భంగా జవడేకర్‌ను కోరారు.