రాష్ట్రీయం

పెరిగిన భక్తవరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15 : తెలంగాణలోని మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోని కృష్ణా పుష్కరాల్లో భక్తి తాండవిస్తోంది. పుణ్యస్నానాలకు వస్తున్న భక్తులు భగవన్నామస్మరణలో మునిగితేలుతున్నారు. పుష్కరాలు ప్రారంభం తర్వాత భక్తుల తాకిడి ఏమాత్రం తగ్గడం లేదు. పైగా రోజురోజుకు భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. రోజూ లక్షల సంఖ్యలో తరలి వస్తున్నారు. రెండు జిల్లాల్లో కలిపి 20 లక్షల నుండి 30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారని అధికారవర్గాలు వెల్లడిస్తున్నాయి. ఆది పుష్కరాలు పూర్తయ్యేసరికి ఈ సంఖ్య మూడు కోట్లకు చేరే అవకాశం ఉందన్నది అంచనా. పుష్కర స్నానాలు చేస్తున్న భక్తులు సమీపంలోని ఆలయాలకు వెళుతుండటంతో దేవాలయాయాలు కిటకిట లాడుతున్నాయి. తెలంగాణ ఆర్టీసి బస్సులతో పాటు, రైల్వేశాఖ ఏర్పాటుచేసిన ప్రత్యేక సర్వీసుల్లో రద్దీ కనిపిస్తోంది. 23 వరకు ఇదే పరిస్థితి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. పితృతర్పణాల కోసం దేవాదాయ శాఖ ప్రత్యేక కిట్లు తయారు చేసి సరఫరా చేస్తోంది. ప్రభుత్వ విభాగాలతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు, ఇతర సంస్థలు కూడా పిండప్రదానాలకు సంబంధించిన కిట్లను తక్కువ ధరల్లో సరఫరా చేస్తున్నాయి.
మంత్రుల పరిశీలన
దేవాదాయ ధర్మాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి. లక్ష్మారెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో వివిధ ఘాట్లకు వెళ్లి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. మంత్రులు స్వయంగా వస్తుండటంతో డ్యూటీలోని అధికారులు జాగ్రత్తగా విధులు నిర్వహిస్తున్నారు. అన్ని ఘాట్లలోనూ ప్రభుత్వ సిబ్బంది ఓపికగా, గౌరవంతో భక్తులతో మెలుగుతుండటంతో భక్తుల్లో సంతృప్తి కనిపిస్తోంది.
అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు
పుష్కరాల సందర్భంగా ప్రభుత్వ సాస్కృంతిక శాఖ ఏర్పాటు చేసిన సాంస్కతిక కార్యక్రమాలు (హరికథ, ఒగ్గుకథ, నాటకాలు తదితరాలు) భక్తులను అలరిస్తున్నాయి. అన్ని ప్రధాన పుష్కరాల్లో కూడా ప్రత్యేకంగా వేదికలను ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాలను ప్రదర్శిస్తున్నారు.

చిత్రం.. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి డివిజన్‌లోని రంగాపూర్ ఘాట్‌లో సోమవారం భక్తుల పుష్కర స్నానాలు