రాష్ట్రీయం

విద్యార్థుల నిలువు దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: యుజి, పిజి, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో చేరుతున్న విద్యార్థుల నుండి కాలేజీల యాజమాన్యాలు ప్రభుత్వం నిర్ధేశించిన దానికంటే అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేయడంతో లెక్కలకు అందకుండానే వందల కోట్ల రూపాయిలు వివిధ ఖాతాల్లో ఖాయలా పడుతున్నాయి. కాలేజీల్లో చేరుతున్నపుడు ట్యూషన్ ఫీజు, స్పెషల్ ఫీజులతో పాటు స్పోర్టు ఫీజు, ల్యాబ్ ఫీజు, లైబ్రరీ ఫీజు పేరుతో కాషన్ డిపాజిట్లను కూడా వసూలు చేస్తున్నాయి. ఈ మొత్తంలో కొంత భాగం విద్యార్థి కాలేజీ విడిచిపెట్టినపుడు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. యూనివర్శిటీలు ఇటీవల నిర్ధేశించిన ఫీజులకు అదనంగా యుజి కాలేజీలు ప్రతి విద్యార్థి నుంచి అదనంగా వెయ్యి రూపాయిల వరకూ వసూలుచేస్తుండగా, పిజిలో రూ.1500, ఇంజనీరింగ్ ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో 5 వేలు మొదలు 20 వేల రూపాయిల వరకూ వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం సూచించిన ఫీజులకు ఏ మాత్రం పొంతన లేకుండా పలు ప్రైవేటు, అటానమస్ కాలేజీలు విద్యార్థులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఇంకో పక్క యుజిసి సైతం ఎస్సీ, ఎస్టీ, బిసిలకు రెమిడియల్ కోచింగ్ పేరిట పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేస్తున్నా, వాటిని సైతం యాజమాన్యాలు దిగమింగుతున్నాయి. కాలేజీలో చదువు పూర్తి చేసిన వారు సర్ట్ఫికెట్లు తీసుకునే సమయంలో తమకు రావల్సిన ఫీజు గురించి ఆరా తీసినా ఆ రికార్డులు అందుబాటులో లేవనో, లేదా మూడు నాలుగేళ్ల క్రితం చెల్లించిన ఫీజు రసీదులు ఒరిజనల్ తీసుకురండి చూస్తాం అనో ముడిపెట్టడంతో మూడేళ్ల క్రితం నాటి రసీదులు లేక విద్యార్థులు వాటిని వదిలిపెట్టి వెళ్తున్నారు. అయితే ఈ నిధులు అటు ప్రభుత్వానికీ దక్కక, ఇటు కాలేజీల వాస్తవిక రికార్టులకు వెళ్లకు మధ్యలో సిబ్బంది గోల్‌మాల్ ఖాతాలకు వెళ్తున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు సగటున వదులుకుంటున్న ఫీజు మొత్తం రూ.24 కోట్ల వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. దీని ప్రకారం గత పదేళ్లలో విద్యార్థులు మొత్తం రూ.240 కోట్లు వదిలేసినట్లు స్పష్టమవుతోంది. ఈ ఫీజుల గురించి విద్యార్థులు ఫిర్యాదు చేసినప్పటికీ ఇటు యాజమాన్యాలు గానీ, అటు ప్రభుత్వం గానీ పట్టించుకోకపోవడం గమనార్హం. గత కొద్ది సంవత్సరాల నుంచి ఈవిధంగా అధిక ఫీజులు వసూలు చేసిన ఎవి కాలేజీ ఆఫ్ కామర్స్ అండ్ సైన్స్ కళాశాల అడ్డంగా దొరికిపోయింది. దీంతో అదనంగా వసూలు చేసిన ఫీజులను తక్షణమే విద్యార్థులకు చెల్లించాలని, లేదంటే తీవ్రమైన చర్యలు చేపడతామని హెచ్చరిస్తూ కాలేజీయేట్ కమిషనరేట్ తరఫున మోరయ్య యూనిస్ రెండు రోజుల క్రితం ఆ కాలేజీ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. దీనికోసం విద్యార్థులు పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. రెమిడియల్ క్లాసుల పేరిట వచ్చిన నిధులను, అదనంగా వసూలు చేసిన ఫీజులను తిరిగి చెల్లించాలని విద్యార్థులు ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సైతం ఆశ్రయించాల్సి వచ్చింది. కళాశాల నిర్వహణకు విద్యార్థుల నుండి ఎలాంటి ఫీజులు వసూలు చేయబోమని 1968లో యాజమాన్యం చెప్పడంతో అప్పట్లో ప్రభుత్వం 1594 జీవో ద్వారా ఎవి కళాశాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది. అయితే ఆ ఉత్తర్వులను ఎవి కళాశాల యాజమాన్యం తుంగలో తొక్కి తమ నుంచి అధిక ఫీజులను వసూలుచేస్తోందని విద్యార్థులు ఆరోపిస్తున్నారు.