రాష్ట్రీయం

మోదీ పాలనలో అభివృద్ధి శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: ప్రధాని నరేంద్ర మోదీ రెండేళ్ళ పాలనలో సాధించిన అభివృద్ధి శూన్యమని సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు సీతారాం ఏచూరి విమర్శించారు. మంగళవారం ప్రారంభమైన పార్టీ ప్లీనం సమావేశానికి ఏచూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశాలు మూడు రోజుల పాటు జరుగుతాయి. ఈ సందర్భంగా సీతారాం ఏచూరి ప్రారంభోపన్యాసం చేస్తూ ప్రధాని మోదీ పాలనపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మత ఘర్షణలు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు బిజెపి ప్రయత్నిస్తున్నదని ఆయన దుయ్యబట్టారు. కేంద్రంలో బిజెపి నేతృత్వంలో ఎన్డీఏ అధికారం చేపట్టిన తర్వాత మైనారిటీలు, దళితులపై దాడులు పెరిగాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా రంగంలో సమూల మార్పులు తెస్తామంటూ గొప్పలు చెప్పి మతోన్మాదాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నదని ఆయన విమర్శించారు. కాశ్మీర్‌లో నెలకొన్న పరిస్థితులు, ఉగ్ర దాడుల గురించి ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోకుండా, బలూచిస్తాన్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగం అంతా తప్పుల తడకగా ఉందని ఆయన విమర్శించారు. 90 నిమిషాల మోదీ ప్రసంగం ఆద్యంతం అవాస్తవాలతో ఉందని, ఏ ఒక్క అంశంపై స్పష్టత లేదని ఆయన తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ కొత్త ప్రకటనలు చేయడం, ఆ తర్వాత దానిని పట్టించుకోవడం షరా మామూలైందని అన్నారు. ఇప్పుడు కూడా ప్రధాని మోదీ ప్రకటన చేశారని ఆయన తెలిపారు. ప్రకటనలు చేయడమే తప్ప అమలు ఉండదని ఏచూరి విమర్శించారు. కేంద్రంలో యుపిఎ అధికారంలో ఉన్నప్పుడు ఎఫ్‌డిఐలను బిజెపి ప్రభుత్వం విమర్శించిందని, ఇప్పుడేమో ప్రోత్సహిస్తున్నదని ఆయన విమర్శించారు.