రాష్ట్రీయం

మాకేమీ తెలియదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: ఆంధ్రప్రదేశ్‌లో సర్వ శిక్షా అభియాన్ నిధులు భారీగా దుర్వినియోగం అయినట్టు తెలిసింది. వివిధ జిల్లాల్లో సర్వ శిక్షా అభియాన్ పేరుతో వెచ్చించిన వందల కోట్ల రూపాయలకు లెక్కలు తెలియడం లేదు.అందుకు సంబంధించిన రికార్డులు కూడా దొరకడం లేదని తెలిసింది. జిల్లాల్లో సర్వ శిక్షా అభియాన్ సంస్థలకు కలెక్టర్లే చైర్మన్లుగా ఉంటారు. ప్రతి పైసా ఖర్చు కలెక్టర్ల పేరుతోనే జరుగుతుంది. తాజాగా 271 కోట్ల రూపాయలకు లెక్కలే దొరకడం లేదు. జిల్లాల్లో సర్వ శిక్షా అభియాన్ ప్రాజెక్టు ఆఫీసర్లకు(పిఓ) లెక్కలు అడిగితే కలెక్టర్ల ఆదేశాల మేరకు వెచ్చించామని చెబుతున్నారు, కలెక్టర్లను అడిగితే ప్రాజెక్టు ఆఫీసర్ల అవినీతి కారణంగానే వందల కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయని అంటున్నారు. గతంలో వివిధ శాఖల నుండి వచ్చిన గ్రూప్-1 ఆఫీసర్లు, కొన్ని చోట్ల ఐఎఎస్‌లు ప్రాజెక్టు ఆఫీసర్లుగా పనిచేశారు. ఇప్పుడు వారంతా సొంత శాఖలకు బదిలీపై వెళ్లడంతో ప్రస్తుతం పనిచేస్తున్న పిఓలు తమకేమీ తెలియదని తప్పించుకుంటుండగా కలెక్టర్లు సైతం అదే బాటలో ‘గతంలో పనిచేసిన కలెక్టర్లకే’ తెలుస్తుందని బుకాయిస్తున్నారు. తాజాగా జరిపిన పరిశీలనలతో 271 కోట్ల రూపాయలకు రికార్టులు లేవనేది స్పష్టం అయింది. అడ్వాన్సుల పేరుతో ఎవరికి పడితే వారికి డబ్బులు ఇచ్చేసిన జిల్లా ప్రాజెక్టు అధికారులు తిరిగి వాటిని వసూలు చేయడంలో విఫలమయ్యారని తెలిసింది. నిబంధనల ప్రకారం ఎవరికైనా ఏదైనా పని మీద అడ్వాన్స్‌లు ఇస్తే దానిని నిర్ణీత సమయంలో రాబట్టుకోవల్సి ఉంటుంది లేదా అందుకు సంబంధించి రసీదు పొందాలి. ఆ రెండు జరగకపోవడంతో వివిధ జిల్లాల్లో అవినీతి జడలు విచ్చుకున్నట్టు తెలిసింది. అనంతపురం జిల్లాలో 23.67 కోట్లు, శ్రీకాకుళం జిల్లాలో 29.33 కోట్లు, విజయనగరంలో 10.06 కోట్లు, విశాఖపట్టణంలో 31.07 కోట్లు, తూర్పుగోదావరి జిల్లాలో 21.7 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలొ 13.04 కోట్లు, కృష్ణాలో 41.41 కోట్లు, గుంటూరులో 28.7 కోట్లు, ప్రకాశంలో 18.39 కోట్లు, నెల్లూరులో 35.07 కోట్లు, చిత్తూరులో 11.82 కోట్లు, కడపలో 16.02 కోట్లు, కర్నూలులో 18.02 కోట్లు గోల్‌మాల్ అయినట్టు ఆడిటింగ్‌లో తేలింది. వీటన్నింటికీ 15 రోజుల్లో యుటిలైజేషన్ సర్ట్ఫికేట్లు సమర్పించాల్సి ఉంటుంది , అయితే ఏళ్లు గడుస్తున్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దాంతో తన పీకల మీదకు ఎక్కడ వస్తుందోనని భావించిన కొత్త ఎస్‌పిడి జి శ్రీనివాస్ 13 జిల్లాల పిఓలకు షోకాజ్‌లు జారీ చేశారు. 15 రోజుల్లో ఇందుకు సంబంధించి వివరణ ఇవ్వాలని ఆదేశించినట్టు తెలిసింది. ఇప్పటికే దాదాపు అన్ని జిల్లాలు పర్యటించిన ప్రాజెక్టు డైరెక్టర్ అక్కడి వ్యవహారాలు చూసి బిత్తెరపోయారు. కొన్ని జిల్లాల్లో పిఓల ఆధీనంలో పది మంది వరకూ అటెండర్లను వాడుకోవడం చూస్తుంటే సర్వ శిక్షా అభియాన్ నిధులు ఏ విధంగా పిఓలు వెచ్చిస్తున్నారో స్పష్టమైంది. మరోవైపు పిఓల వ్యవహారంపై వివిధ జిల్లాల కలెక్టర్లకు పిడి డిఓ లెటర్లు కూడా రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా అడ్వాన్స్‌ల కింద పెండింగ్‌లో ఉన్న 271 కోట్ల నిధులకు యుసిలు సమర్పించేలా చూడాలని కూడా కలెక్టర్లను పిడి ఆదేశించారు. మరో పక్క వివిధ పథకాల కింద పేద పిల్లలకు ఖర్చు చేయాల్సిన మరో 385 కోట్ల రూపాయిలు జిల్లాల్లో పిఓల ఖాతాల్లో మూలుగుతున్నాయి. రాష్ట్ర అధికారుల నిర్వాకం చూసిన కేంద్రం రాష్ట్రానికి వెయ్యి కోట్లు విడుదల చేయకుండానే ఆపేసింది.