రాష్ట్రీయం

పుష్కర విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 16: కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటు చేసుకుంది. గత నాలుగు రోజులుగా పుష్కరాలు సజావుగా సాగుతున్నా, ఐదో రోజున కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎనిమిది మంది చనిపోయారు. పుష్కర స్నానానికి వెళ్లి ఐదుగురు విద్యార్థులు మృతిచెందారు. ఈ దుర్ఘటన కృష్ణా, గుంటూరు జిల్లాల సరిహద్దుల్లో దిడుగు వద్ద మంగళవారం చోటు చేసుకుంది. నందిగామ చైతన్య కళాశాలలో ఫైనలియర్ డిగ్రీ చదువుతున్న చందర్లపాడు మండలం తోటరావులపాడు గ్రామానికి చెందిన ములకపల్లి హరీష్, చెరువుకొమ్ముపాలేనికి చెందిన పాశం గోపిరెడ్డి, నందిగామకు చెందిన కూచి లోకేశ్వర సాయి సూర్యగోపాల్ (లోకేష్), కొమ్మవరపు హరిగోపి, జయంతి గ్రామానికి చెందిన నందిగామ నగేష్ మరికొందరు స్నేహితులతో కలసి స్నానానికి నదిలో దిగారు. స్నానం చేస్తూ నదీ ప్రవాహంలోకి జారుకుని ఊబిలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. సంఘటన గుంటూరు జిల్లా పరిధిలో జరిగింది. మృతులంతా కృష్ణాజిల్లాకు చెందిన వారు కావడంతో మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నందిగామ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇసుక అడ్డగోలు తవ్వకాల వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది.
వేర్వేరు దుర్ఘటనల్లో ముగ్గురు మృతి
విజయవాడ: ఇబ్రహీంపట్నం దగ్గరున్న ఫెర్రీ ఘాట్‌లో పిండ ప్రదానం చేయించేందుకు వచ్చిన పూజారి సూరేపల్లి రంగయ్య గుండెపోటుతో మరణించారు. మైలవరానికి చెందిన రంగయ్య పుష్కరనగర్‌లో భోజనం చేస్తూ గుండెపోటుతో మృతి చెందాడు. అలాగే కృష్ణా జిల్లా మొవ్వకు పుష్కర విధులకు ద్విచక్రవాహనంపై వెళుతున్న కల్పన మృతి చెందింది. ముఖానికి కట్టుకున్న గుడ్డ వాహనం చక్రానికి చుట్టుకోవడంతో వాహనం పల్టీ కొట్టడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది.

చిత్రం..విద్యార్థుల మృతదేహాలు