రాష్ట్రీయం

పారదర్శకతే ఆశయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 16: ‘నాపై నమ్మకం ఉంచండి. మెరుగైన, పారదర్శకమైన పాలన అందిస్తా. రాష్ట్రంకోసం.. మీకోసం కృష్ణా పుష్కరాల సందర్భంగా సంకల్పం చేయండ’ని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘మనమంతా ఇక్కడే పుట్టాం.. ఈ నీళ్లు తాగాం.. వ్యవసాయం చేశాం.. పిల్లలు ఉన్నత చదువులు చదువుతున్నారు.. కొందరు విదేశాలకు వెళ్లారు.. చరిత్రలో నదీతీర ప్రాంతాలే నాగరికతకు చిహ్నాలుగా నిలిచాయ’ని అన్నారు. మంగళవారం అమరావతి వచ్చిన చంద్రబాబు ఇక్కడి పుష్కర్‌ఘాట్‌ను పరిశీలించారు. యాత్రికులకు అందుతున్న సేవలపై భక్తులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. నదీమతల్లి రుణం తీర్చుకుంటే రాష్ట్రం మరింత పురోగతి సాధిస్తుందన్నారు. తన హయాంలో గోదావరి, కృష్ణా పుష్కరాలు వరుసగా రావడం అదృష్టమన్నారు. పుష్కరుణ్ని నేనే తీసుకువచ్చా. ఇది నా జీవితంలో అరుదైన.. అపూర్వ ఘట్టం. పట్టిసీమ ద్వారా గోదావరి- కృష్ణా నదుల అనుసంధానానికి నాంది పలికామన్నారు. త్వరలో గోదావరి-పెన్న అనుసంధానంతో రాయలసీమ కడగండ్లు తీరుస్తామన్నారు. సోమశిల ద్వారా నీరందించే ఏర్పాటు చేస్తామన్నారు. ఉత్తరాంధ్రలో వంశధార-నాగావళిని కలిపి సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ‘పుష్కరాలంటే 12 నదులు కలిసే పవిత్ర సన్నివేశం.. ముక్కోటి దేవతలూ ఇక్కడే కొలువై ఉంటారు.. నదుల్ని ప్రేమించాలి.. ఇందులో కులం.. మతం.. ప్రాంతీయ భేదాలు ఉండవ’ని అన్నారు. నదీ స్నానంతోనే ఆనందం.. ఆరోగ్యం.. సమాజంలో 80 శాతం మంది ఆనందంగా ఉంటారు.. మరో 20 శాతం మందికి మానసిక పరిస్థితి సరిగా ఉండదని పరోక్షంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని విమర్శించారు. రాష్ట్రంలో 9 జిల్లాలకు కృష్ణమ్మ ప్రాణనది అన్నారు.

చిత్రం.. గుంటూరు జిల్లా అమరావతి ధరణికోట ఘాట్ వద్ద పుష్కర యాత్రికులకు అభివాదం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు