రాష్ట్రీయం

కొత్తగా 251 వెటర్నరీ పోస్టులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్రంలో 251 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు (క్లాస్-ఎ) పోస్టుల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీసు కమిషన్ మంగళవారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పరీక్షలకు ఆన్‌లైన్‌లో 19 నుంచి దరఖాస్తులు సమర్పించవచ్చు. దరఖాస్తులను దాఖలు చేసేందుకు వచ్చే నెల 7వ తేదీ వరకూ గడువు ఇచ్చారు. సెప్టెంబర్ 25వ తేదీన ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలను 19న విడుదల చేయనున్నట్టు కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ తెలిపారు. కాగా, గత ఏడాది 18వ తేదీన నిర్వహించిన అగ్రికల్చర్ ఆఫీసర్ పోస్టుల ప్రిలిమినరీ కీని బుధవారంనాడు విడుదల చేయనున్నారు. దానిపై ఈ నెల 19వ తేదీ వరకూ అభ్యంతరాలను స్వీకరిస్తారు. అనంతరం తుది కీ రూపొందించి తుది ఎంపిక ఫలితాల జాబితాను రూపొందిస్తారు. అదే విధంగా గత ఏడాది అక్టోబర్ 17, 18 తేదీల్లో నిర్వహించిన హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల పరీక్షకు సంబంధించి ప్రిలిమినరీ కీని కమిషన్ బుధవారం నాడు విడుదల చేయనుంది. దానిపై అభ్యంతరాలు ఏమైనా ఉంటే వాటిని ఈ నెల 19వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సమర్పించాలని కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్ వివరించారు.