రాష్ట్రీయం

20నే అఖిలపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: కొత్త జిల్లాల ముసాయిదా నోటిఫికేషన్‌పై చర్చించేందుకు ఈనెల 20న అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సిఎం కె చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈమేరకు అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. అఖిలపక్ష సమావేశానికి అధికార తెరాస, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ సహా భాజపా, తెదేపా, సిపిఐ, సిపిఎంలను ప్రభుత్వం ఆహ్వానించింది. పార్టీకి ఇద్దరి చొప్పున ప్రతినిధులు హాజరు కావాల్సిందిగా సూచించింది. క్యాంపు కార్యాలయంలో మంగళవారం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియపై మంత్రి జగదీశ్‌రెడ్డి, సిఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, కార్యదర్శులు స్మితా సభర్వాల్, శాంతికుమారి, రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులతో సిఎం చర్చించారు. అఖిలపక్ష సమావేశానికి తనతోపాటు మంత్రివర్గ ఉప సంఘం, భూపరిపాలన కమిషనర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు రెవిన్యూ, ఆర్థికశాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని పేర్కొన్నారు. అఖిలపక్ష సమావేశంలో ముసాయిదాపై చర్చించిన అనంతరం అదే రోజు సాయంత్రం 4.30కు మంత్రిమండలి ప్రత్యేకంగా సమావేశమై ముసాయిదాను ఆమోదించాలని సిఎం
నిర్ణయించారు. ఇలావుండగా కొత్త జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి మార్గదర్శకాలను సూచించడానికి ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం తన నివేదికను ప్రభుత్వానికి గురువారం సమర్పించనున్నట్టు సమాచారం. ఉప సంఘం ఇప్పటికే ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, జిల్లాలవారీగా ప్రజాప్రతినిధులతో సమావేశమై అభిప్రాయాలు సేకరించిన విషయం తెలిసిందే. అఖిలపక్ష సమావేశం జరగటానికి ముందు సిసిఎల్‌ఏ కమిషనర్, కలెక్టర్లు, రెవిన్యూ, ఆర్థికశాఖల ఉన్నతాధికారులతో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం కానున్నట్టు సమాచారం. అలాగే భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ మరోసారి సమావేశమై ఉద్యోగుల విభజన, జోనల్ వ్యవస్థ, కొత్త జిల్లాలకు వౌలిక వసతుల కల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్టు తెలుస్తోంది.