రాష్ట్రీయం

వ్యవసాయ అభివృద్ధికి అధిక నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, ఆగస్టు 16: తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయ అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తున్నట్లు స్పీకర్ మధుసూదనాచారి, రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటెల రాజేందర్, వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. మంగళవారం ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ విస్తరణ పనులు ప్రారంభించిన అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కల వ్యవసాయ అభివృద్ధి అని, ఆ దిశగా తెలంగాణ రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో బడ్జెట్‌లో అధిక శాతం నిధులు కేటాయించారన్నారు. రైతు ఏప్పుడు వ్యాపారి కాడని, రైతు చమటోడ్చి కష్టపడి పని చేస్తాడని, రైతే దేశానికి వెనె్నముక అని, అలాంటి రైతును విస్మరిస్తే పుట్టగతులు ఉండవన్నారు. గతంలో ఒక ముఖ్యమంత్రి వ్యవసాయం దండగ అని, రైతు బాగోగులు విస్మరించి వ్యవహరించాడని, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకూడదని తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ఎక్కువ నిధులతో సబ్సిడి ఇస్తోందన్నారు.

చిత్రం.. అశ్వారావుపేటలో పామాయిల్ ఫ్యాక్టరీ విస్తరణ పనులు ప్రారంభిస్తున్న మంత్రులు పోచారం, తుమ్మల నాగేశ్వరరావు