రాష్ట్రీయం

విశాఖకు ‘సిట్’ బృందం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, ఆగస్టు 17: సంచలనం సృష్టించిన మాఫియాడాన్ నరుూం ఉదంతం తాలూకు మూలాలు విశాఖలోనూ విస్తరించినట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన దర్యాప్తు సంస్థ సిట్ అధికారులు అందుకు అవసరమైన ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు? విశాఖ కేంద్రంగా కూడా నరుూం తన కార్యకలాపాలు సాగించినట్టు గుర్తించి, విచారణలో భాగంగా సిట్ బృందాలు విశాఖ చేరుకున్నట్టు సమాచారం. అయితే నరుూం కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు విశాఖ వచ్చినట్టు తమకు కనీస సమాచారం లేదంటూ పోలీసు వర్గాలు తప్పుకుంటున్నాయి. నరుూం ఎన్‌కౌంటర్ అనంతరం ఆధారాలు సేకరించే పనిలోపడ్డ సిట్ అధికారులు డైరీ, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా విశాఖలోనూ నరుూం ఆగడాలు కొనసాగాయని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. విశాఖ నగరంతో పాటు మధురవాడ, గాజువాక ప్రాంతాల్లో నరుూం ముఠా పలు సెటిల్‌మెంట్లకు పాల్పడినట్టు నిర్ణయించారు. సిట్ అధికారులు విశాఖలో నరుూం సెటిల్‌మెంట్లపై ఆరాతీసే క్రమంలో ఇప్పటికే ఒకసారి ఇక్కడకు వచ్చి వెళ్లినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. రైలులో ఒకటి, రెండు పర్యాయాలు ఇక్కడకు వచ్చిన నరుూం భూ వివాదాలను పరిష్కరించడంతో పాటు ఇక్కడ కూడా ఆస్తులు కొనుగోలు చేసినట్టు ప్రచారం సాగుతోంది. ఇందుకు సంబంధించి ఎటువంటి వివరాలను స్థానిక పోలీసులకు సిట్ అధికారులు వెల్లడించలేదు.