రాష్ట్రీయం

కొత్త జిల్లాలు 17

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 17: తెలంగాణ రాష్ట్రాన్ని పాలనా సౌలభ్యం కోసం 27 జిల్లాలుగా విభజించాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ప్రస్తుతం ఉన్న పది జిల్లాలతోపాటు కొత్తగా 17 జిల్లాలను ఏర్పాటు చేయాలని సూచించింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై మంత్రివర్గ ఉప సంఘం బుధవారం ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదనసహా ప్రజల నుంచి వచ్చిన సూచనలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కెసిఆర్ మంత్రివర్గ ఉప సంఘం చైర్మన్, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, భూ పరిపాలనశాఖ ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్, రెవిన్యూశాఖ ముఖ్య కార్యదర్శి ప్రదీప్ చంద్రా తదితరులతో ఆరు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించారు. ప్రస్తుతం ఉన్న 44 రెవెన్యూ డివిజన్ల స్థానంలో 74 డివిజన్లకు, 459 మండలాలకు గాను 533 మండలాలకు పెంచాలని మంత్రివర్గ ఉప సంఘం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనలపై అఖిలపక్ష సమావేశంలో చర్చించిన తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం నెల రోజుల వ్యవధి ఇచ్చి ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాఉండగా కొత్త జిల్లాల జాబితాలో గద్వాల, జనగామ, సిరిసిల్లలకు చోటు దక్కలేదు.

27 జిల్లాలు ఇవే!
1 ఆదిలాబాద్
2 మంచిర్యాల
3 నిర్మల్
4 కరీంనగర్
5 పెద్దపల్లి
6 జగిత్యాల
7 వరంగల్
8 మహబూబాబాద్
9 హన్మకొండ
10 భూపాలపల్లి
11 మెదక్
12 సిద్దిపేట
13 సంగారెడ్డి
14 నిజామాబాద్
15 కామారెడ్డి
16 నల్లగొండ
17 సూర్యాపేట
18 యాదగిరి
19 మహబూబ్‌నగర్
20 నాగర్‌కర్నూల్
21 వనపర్తి
22 ఖమ్మం
23 కొత్తగూడెం
24 హైదరాబాద్
25 వికారాబాద్
26 శంషాబాద్
27 మల్కాజ్‌గిరి