రాష్ట్రీయం

చత్తీస్‌గఢ్‌లోనూ దందా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, ఆగస్టు 18: నరహంతకుడు నరుూం దందా సరిహద్దు రాష్ట్రం చత్తీస్‌గఢ్‌లోనూ సాగుతోందా? అవుననే వాదనకు అక్కడి పోలీసులకు లభ్యమైన ఆధారాలు బలం చేకూర్చుతున్నాయి. బుధవారం ఆ రాష్ట్రంలోని దంతెవాడ జిల్లా దబ్బాకున్నా అటవీప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్లో లభ్యమైన మావోయిస్టుల లేఖలో సంచలనం కలిగించే అంశాలు బయట పడ్డాయి. ఏరియా కమిటీ సభ్యుడు వర్గీస్ తమ పార్టీ అగ్రనేత జగదీశ్‌కు రాసిన లేఖ ఒకటి పోలీసులకు దొరికింది. ఆ లేఖ ఈ ఏడాది మార్చి 15న రాసినట్లుగా ఉంది. బస్తర్ ఐజి కల్లూరి మావోయిస్టు పార్టీకి ప్రధాన శత్రువుగా, కంటకంగా మారాడని వర్గీస్ లేఖలో పేర్కొన్నాడు. అతని చర్యల వల్ల పార్టీ నిర్మాణానికి తీవ్ర విఘాతం కల్గుతోందని ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు లొంగిపోతున్నారని అందులో పేర్కొన్నాడు. ఎస్‌ఆర్ కల్లూరిని హత్య చేయించేందుకు సుపారీ ఇవ్వడానికి సిద్ధ పడ్డామని, ఇందుకు చందాలు కూడా భారీగానే వసూలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసులతో సన్నిహితంగా ఉండే వ్యక్తి అయిన నరుూంతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నట్లుగా ఆ లేఖను బట్టి చత్తీస్‌గఢ్ పోలీసు ఉన్నతాధికారులు విశే్లషిస్తున్నారు. నరుూంతో ఒప్పందం చేసుకునేందుకు మావోయిస్టు పార్టీ ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకుందని నిర్ధారణకు వచ్చినట్లుగా సమాచారం. ఈ లేఖ ఇపుడు చత్తీస్‌గఢ్ ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. దండకారణ్యంలో మావోయిస్టుల అణచివేతలో కల్లూరి అనుసరిస్తున్న తీరుతో తాజాగా చత్తీస్‌గఢ్‌లో పోలీసులు పైచేయి సాధిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ఇటీవల మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను జరుగకుండా చేయడమే కాకుండా వారు నిర్మించిన స్థూపాలను ధ్వంసం చేశారు. దీనికి తోడు భారీ సంఖ్యలో నిత్యం మావోయిస్టు క్యాడర్ లొంగిపోతోంది. ఆపరేషన్ గ్రీన్‌హంట్ వేగవంతం కావడంతో పాటు గగనతలం నుంచి వైమానిక దాడులు చేయించేందుకు కేంద్రం మూడు హెలికాప్టర్లను కూడా సిద్ధం చేసింది. ఈ తరుణంలో కల్లూరిని హతమార్చడం ద్వారా మావోయిస్టు పార్టీ తిరిగి ఆధిపత్యాన్ని చెలాయించేందుకు ప్రణాళిక రూపొందించినట్లుగా రూఢి అవుతోంది.

చిత్రం.. పోలీసులకు లభ్యమైన లేఖ