రాష్ట్రీయం

జిఎస్‌టి కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 18:జిఎస్‌టి బిల్లుపై చర్చించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం జరుగుతుందని పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. ప్రత్యేక సమావేశం నిర్వాహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ భావిస్తున్నారని తెలిపారు. జిఎస్‌టి ప్రభావం రాష్ట్ర ఆదాయంపై ఏ విధంగా ఉంటుందో ప్రత్యేక సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. బిల్లు ఆమోదానికి ముందు విస్తృతంగా చర్చ అవసరం. అదే విధంగా బిల్లులో మార్పులు చేర్పుల గురించి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం ఉంటుందని చెప్పారు. జిఎస్‌టి బిల్లుకు తెలంగాణ మద్దతు ప్రకటించింది. జిఎస్‌టి బిల్లును ఆమోదించేందుకు ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల ముఖ్యమంత్రి కెసిఆర్‌కు లేఖ రాశారు. అస్సాం, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల శాసన సభలు ఇప్పటికే జిఎస్‌టి బిల్లుకు తమ రాష్ట్ర శాసన సభల్లో ఆమోదం తెలిపాయి.