రాష్ట్రీయం

ఎపిపిఎస్‌సి తొలి నోటిఫికేషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఆగస్టు 18: ప్రభుత్వ శాఖల్లో ఖాళీగానున్న పోస్టుల్లో 4వేల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా తొలి విడతగా 748 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డాక్టర్ ఉదయభాస్కర్ గురువారం నోటిఫికేషన్ జారీ చేశారు. పబ్లిక్ హెల్త్, మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో 56 సివిల్ పోస్టులు, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగంలో 41 సివిల్, మెకానిక్ పోస్టులు, జలవనరుల శాఖలో 473 సివిల్, 63 మెకానిక్, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో 113 సివిల్, మెకానిక్, భూగర్భ జల శాఖలో 2 మెకానిక్ అగ్రికల్చర్ పోస్టులు భర్తీ కానున్నాయి. జూలై 1వ తేదీ లోపు 40 ఏళ్ళు నిండిన వారందరూ అర్హులే. డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డాట్ పిఎస్‌పి డాట్ ఎపి డాట్ జివోవి డాట్ ఇన్ వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని భర్తీ చేసి సెప్టెంబర్ 21వ తేదీలోపు పంపించాల్సి ఉంటుంది. నవంబర్ మొదటి వారంలో పరీక్షలు జరిగే అవకాశముంది. పరీక్షలకు వారం రోజులు ముందు హాల్‌టిక్కెట్లను ఎవరికి వారే డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంది.