రాష్ట్రీయం

అమెరికాలో నరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 22: చదువుకోవాలని వెడితే జీవితంలో మరచిపోలేని చేదు అనుభవాలను మూటగట్టుకుని...వెళ్లిన రెండు మూడు రోజుల్లోనే తిరిగి వచ్చారు కొందరు తెలుగు విద్యార్థులు. అమెరికాలో తమకు ఎదురైన భయానక అనుభవాలను తలచుకోవడానికి కూడా వారు భయంతో వణికి పోతున్నారంటే టార్చర్ ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులనే అనుమానంతో తమను చీకటి గదిలో బంధించి, తుపాకీ చూపించి బెదిరించారని వారు వాపోయారు. అమెరికాలోని ఎన్‌పియు, సిలికాన్ వ్యాలీ యూనివర్సిటీల్లో చేరేందుకు వెళ్లిన కొందరు తెలుగు విద్యార్థులకు ఎదురైన చేదు అనుభవాలివి. అమెరికన్ పోలీసుల చెరనుంచి విడుదలై, బతుకుజీవుడా అంటూ స్వదేశానికి బయల్దేరిన విద్యార్థులు మంగళవారం తెల్లవారు జామున హైదరాబాద్ విమానాశ్రయంలో దిగారు. అమెరికాలో తాము ఎదుర్కొన్న అవమానాలను వివరిస్తే అవాక్కవడం తల్లిదండ్రుల వంతయింది. ‘అమెరికాలో మూడు రోజుల పాటు మమ్మల్ని ఓ చీకటి గదిలో బంధించారు. ఆడపిల్లలనే కనికరం కూడా చూపలేదు. చెప్పండి ఉగ్రవాద కార్యకలాపాల కోసం వచ్చారా? ఏం పేల్చేయాలని ప్లాన్ వేశారో చెప్పండి అంటూ పోలీసులు తుపాకులు గురిపెట్టి మమ్మల్ని భయభ్రాంతులకు లోనుచేశారు. ఖాళీ పత్రాలపై సంతకాలు తీసుకుని, మూడు రోజుల తర్వాత వదలిపెట్టారు’అని అమెరికానుంచి వచ్చిన కొందరు విద్యార్థినులు భోరున విలపిస్తూ చెప్పారు. తమను ఎందుకు టార్గెట్ చేశారో, ఇలా ఎందుకు హింసిస్తున్నారో తెలీని తాము ఆ మూడు రోజులూ నరకం చవి చూశామని వారు వాపోయారు.
కమిషన్లకు కక్తుర్తి పడి...
విద్యార్థులను అమెరికాకు పంపించే కన్సల్టెన్సీలు తమ కమీషన్ కోసం పెద్దగా గుర్తింపులేని యూనివర్సిటీలకు ఎక్కువగా విద్యార్థుల దరఖాస్తులు పంపిస్తారు. సాధారణంగా డబ్బులకు ఆశ పడే కన్సల్టెన్సీలు ఇలా చేస్తాయి. ఏ విద్యార్థయినా కనె్సల్టెన్సీని సంప్రదిస్తే వారు చెప్పే పేరు- ఎన్‌పియు యూనివర్సిటీ. నిజానికి ఇది కనీసం జిఆర్‌ఇ పరీక్ష కూడా రాయాల్సిన అవసరం లేని యూనివర్సిటీ. విద్యార్థి చెల్లించిన ఫీజులో 35 శాతాన్ని యూనివర్సిటీ వాళ్లు ఈ కన్సల్టెన్సీకి కమీషన్‌గా ఇస్తారు. దాంతో కనె్సల్టెన్సీలు ఈ యూనివర్సిటీకే ప్రాధాన్యతనిస్తాయి. చాలామంది విద్యార్థులకు ఈ యూనివర్సిటీ సంగతి తెలిసినా అమెరికా వెళ్లి మరో వర్సిటీకి మారవచ్చులే అనే అభిప్రాయంతో వెళతారు. ఇప్పటివరకు చాలామంది అలా చేశారు కూడా. అయితే పారిస్‌లో ఉగ్రవాదుల దాడి తరువాత భద్రత విషయంలో అమెరికా కఠినంగా ఉంటోంది. ఇందులోభాగంగా ఎస్‌పియు వర్సిటీకి వచ్చే విద్యార్థులపై దృష్టి సారించింది. ఇది తెలియని అనేకమంది విద్యార్థులు ఎస్‌పియుకి వెళ్లి అక్కడ అమెరికన్ పోలీసుల చేతిలో భంగపడాల్సి వచ్చింది. అమెరికాలో గుర్తింపులేని వర్సిటీలకు వెళ్లి విద్యార్ధులు భంగుపడుతున్న నేపథ్యంలో అక్కడికి వెడుతున్న భారతీయ విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యగా నిలిపివేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తమ యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టలేదని ఎన్‌పియు యూనివర్సిటీ విద్యార్థులకు మెయిల్స్ పంపుతోంది. దీంతో విద్యార్థిలోకంలో తీవ్ర గందరగోళం చెలరేగుతోంది.
కనె్సల్టెన్సీల మోసం
అమెరికా వెళ్లాలనుకునే ప్రతి విద్యార్థీ దాదాపుగా ఐదు యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకుంటాడు. ప్రతి వర్సిటీ కొంత దరఖాస్తు రుసుం వసూలు చేస్తుంది. కన్సల్టెన్సీలు ఒక్కో దరఖాస్తుకు ఏడున్నర వేల నుంచి పది వేల రూపాయల వరకు వసూలు చేస్తాయి. ఇక్కడి నుంచి మోసం మొదలవుతుంది. ఐదు యూనివర్సిటీలకు దరఖాస్తు పంపిస్తామని చెప్పి ఒకటి రెండు వర్సిటీలకే పంపిస్తారు. వీటిలో ఒకటి ఎన్‌పియులాంటి వర్సిటీ ఉంటుంది. ఐదు యూనివర్సిటీలకు దరఖాస్తులు పంపేందుకు 30 వేల రూపాయలను అశోక్‌నగర్‌లోని ఓ కన్సల్టెన్సీకి చెల్లిస్తే, చివరకు ఎన్‌పియులో సీటు వచ్చిందని పంపించారని ఓ విద్యార్థి వాపోయాడు. ఎంతో ఆశ పడి వెళితే అమెరికా విమానాశ్రయంలో బంధించి మానసికంగా హింసించి తిప్పి పంపించారని కొందరు విద్యార్థులు తెలిపారు. ఇంత జరిగినా ఇప్పటివరకూ ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం విడ్డూరం.

ఎన్‌పియు యూనివర్సిటీ విద్యార్థికి రాసిన లేఖ ...
తమ విశ్వవిద్యాలయం బ్లాక్ లిస్ట్‌లో చేర్చలేదని బుకాయిస్తూ లేఖ రాసిన యూనివర్సిటీ