రాష్ట్రీయం

వీసీ కారణం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 24: హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీలో రీసెర్చి స్కాలర్ రోహిత్ వేముల ఆత్మహత్యకు వైస్ చాన్సలర్ అప్పారావు, వర్శిటీ అధికార యంత్రాంగం బాధ్యులు కాదని కేంద్ర మానవ వనరుల మంత్రిత్వశాఖ నియమించిన జస్టిస్ ఎకె రూపన్‌వాల కమిటీ తేల్చిచెప్పినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది.
రోహిత్ దళితుడు కాదని కూడా ఏకసభ్య కమిషన్ తన నివేదికలో ప్రస్తావించినట్టు సమాచారం. నివేదిక మానవ వనరుల మంత్రిత్వశాఖకు చేరినా, ఇంకా తన దృష్టికి రాలేదని, వస్తే తదుపరి చర్యలు చేపడతామని మానవ వనరుల అభివృద్ధి మంత్రి ప్రకాష్ జవడేకర్ వ్యాఖ్యానించినట్టు తెలిసింది. కాగా అప్పటి గుంటూరు కలెక్టర్ దర్యాప్తు నిర్వహించి రోహిత్ వేముల సామాజిక నేపథ్యం దృష్ట్యా దళితుడిగానే గుర్తిస్తూ జాతీయ ఎస్సీ కమిషన్‌కు నివేదించారు.
ఈ రెండు నివేదికలు పరస్పరం విరుద్ధంగా ఉండటంతో కేంద్రం తదుపరి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాల్సి ఉందని విద్యార్ధి సంఘాల నేతలు అభిప్రాయపడుతున్నారు. కాగా నివేదిక నేపథ్యంలో దళిత సంఘాల నాయకులు అంతా ఈనెల 29న మహాధర్నాకు సన్నద్ధమవుతున్నారు. రోహిత్ తల్లి రాధిక వేముల, మేనల్లుడు డాక్టర్ అంబేద్కర్, ప్రకాష్ అంబేద్కర్ తదితరులు పాల్గొంటారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు బాధ్యులైన వారందరినీ అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
మెస్ సదుపాయాలను రద్దు చేయడంతో ఆరుగురు విద్యార్ధులు ఇచ్చిన పిలుపు మేరకు మహాధర్నాకు పూనుకున్నట్టు స్ట్రగుల్ కమిటీ ఫర్ జస్టిస్ టు రోహిత్ వేముల కన్వీనర్ బండారు లక్ష్మయ్య పేర్కొన్నారు. వీరందర్నీ ఈనెల 26లోగా ప్రోక్టోరియల్ బోర్డు ముందు హాజరుకమ్మని యూనివర్శిటీ అధికారులు ఆదేశించారని వివరించారు. డాక్టర్ ఆనంద్ టెల్తుబ్దే, ప్రకాష్ అంబేద్కర్, తీస్తా సెతల్వాద్ తదితరులు మహాధర్నాకు ముఖ్య అతిథులుగా హాజరవుతారని పేర్కొన్నారు. హెచ్‌సియు, ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రొఫెసర్లు, అనేకమంది ప్రొఫెసర్లు హాజరవుతారని వివరంచారు. రోహిత్ వేముల ఆత్మహత్యకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డు కేస్ట్స్ (ఎన్‌సిఎస్సీ) సైబరాబాద్ పోలీసులను ఆగస్టు 3న ఆదేశించినా ఇంతవరకూ చర్యలు చేపట్టలేదని లక్ష్మయ్య ఆరోపించారు.