ఆంధ్రప్రదేశ్‌

ఆస్తి తగాదాల్లో వ్యక్తి దారుణ హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొల్లిపర/ తెనాలి రూరల్, ఆగస్టు 24: గుంటూరు జిల్లా కొల్లిపర మండలం సిరిపురం- నేలపాడు రోడ్‌లో బుధవారం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రూరల్ పోలీసుల కథనం ప్రకారం కొల్లిపర మండలం తూములూరుకు చెందిన పగడాల బలరామిరెడ్డి(45) భార్య శ్రీలక్ష్మీ, అత్త ఆళ్ళ సీతమ్మ కలిసి ఆటోలో తెనాలి వస్తుండగా సిరిపురం వద్ద ఓ కారు వేగంగా వచ్చి ఆటోను ఢీకొనటంతో ప్రక్కనే ఉన్న పంటకాలువలో ఆటో పడిపోయింది. ఆటోలో ఉన్న వ్యక్తులు ఆటో నుండి గాయాలతో బయటకు వస్తుండగా కారులో నుండి దిగిన కొందరు దుండగులు కొడవళ్ళు, కత్తులతో ఆటోలోని వ్యక్తులపై దాడికి తెగబడ్డారు. బలరామిరెడ్డిని అతిదారుణంగా నరికి చంపారు. మహిళలు అనే కనికరం లేకుండా సీతమ్మ, శ్రీలక్ష్మిలపై కూడా దుండగులు దాడికి పాల్పడ్డారు.
లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురు మృతి
చంద్రగిరి, ఆగస్టు 24: చిత్తూరు జిల్లా చంద్రగిరికి సమీపంలో నిలిచి ఉన్న లారీని వెనుకవైపుగా ఓ కారు ఢీకొనడంతో ముగ్గురు మృతి చెందిన సంఘటన బుధవారం ఉదయం జరిగింది. చంద్రగిరి పోలీసుల కథనం మేరకు తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా మూటకమ్మల్ గ్రామం పట్టియమ్మల్ వీధికి చెందిన కుటుంబ సభ్యులు 12మంది మంగళవారం రాత్రి 11 గంటలకు తిరుమలకు బయలుదేరారు. కారు చంద్రగిరి సమీపంలోని శ్రీనివాస సిస్టైన్ ఫ్యాక్టరీ వద్దకు రాగానే జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వేగంగా ఢీకొంది. కారులో ఉన్న ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.
ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి
భద్రాచలం/చింతూరు, ఆగస్టు 24: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా డోర్నపాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఎన్‌కౌంటర్ జరిగింది. కెర్లపాల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మావోయిస్టులు సమావేశం అయ్యారని, వారు పోలీస్‌స్టేషన్‌పై దాడికి సిద్ధపడుతున్నారన్న సమాచారంతో భద్రతాబలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. దక్షిణబస్తర్ ప్రాంతానికి చెందిన మావోయిస్టులు దాడుల్లో పాల్గొంటున్నారని తెలిసి భద్రతాబలగాలు అక్కడకు చేరుకున్నాయి. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పులు జరుఫుకుంటూ మావోయిస్టులు అడవుల్లోకి పారిపోయారు.
స్నానానికి దిగి ఇద్దరు యువకుల మృతి
అమరావతి, ఆగస్టు 24: గుంటూరు జిల్లా అమరావతి మండలం ధరణికోట అల్లుళ్లపేట రేవులో స్నానానికి దిగి ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు. కృష్ణాజిల్లా గుడివాడ ప్రాంతానికి చెందిన నలుగురు యువకులు అమరావతిలో కృష్ణా పుష్కరాల సందర్భంగా స్థానిక దుకాణంలో మిఠాయిలు తయారు చేసేందుకు వచ్చారు. పుష్కరాలు ముగియడంతో ఇంటికి తిరుగు ప్రయాణమైన వీరు ధరణికోటలో బట్టలు ఉతికే రేవులో స్నానానికి దిగారు. స్నానానికి దిగిన వీరిలో గరిక వెంకట మహేష్ (24), తోట దుర్గారావు (22) ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతిచెందారు.