ఆంధ్రప్రదేశ్‌

స్విస్‌చాలెంజ్‌లో లోపాలను సరిదిద్దాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుటౌన్, ఆగస్టు 24 : ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణంలో చేపడుతున్న స్విస్ ఛాలెంజ్ విధానంలో మార్పులు చేయాలని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని ప్రజలకు సంబంధించిన ఆస్తి అని దానికి ప్రభుత్వ అధికారులు ధర్మకర్తలు మాత్రమేనని దానిని గుర్తుంచుకొని మెలగాలని టిడిపి పాలకులకు హితవు పలికారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాకముందు పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్‌ను చేసుకొని ఆంధ్రప్రదేశ్ పాలన చేసుకోవచ్చని తెలిపిన చంద్రబాబు ఓటుకు నోటు కేసు తరువాత రాజధానిని విజయవాడకు మార్చడంలో ఆంతర్యం ఏమిటో తెలియడం లేదన్నారు. రాష్ట్రంలో రైల్వే మంత్రి సురేష్‌ప్రభు రూ.950కోట్లు రైల్వే ప్రతిపాదనలకు మంజూరు చేశారని మంగళవారం నంద్యాల నుంచి కడపకు ఒక ప్యాసింజర్‌ను ఏర్పాటు చేశారన్నారు. ఆ సమావేశంలో చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే లైనే వస్తుందని ఆ సభలో వెల్లడించారని, అనంతరం ఏం జరిగిందో తెలియదు నరేంద్రమోదీని విమర్శించారన్నారు. దేశ ప్రధాని నరేంద్రమోది ఆంధ్రప్రదేశ్‌ను ఒక నిబద్దతతో అభివృద్ధి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని , అలాగే రాష్ట్రంలో ఉన్న ఓడరేవులను రూ.800కోట్లు మంజూరు చేశారన్నారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని స్పష్టత లేని ప్రభుత్వం అని టిడిపి నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రపంచంలో చైనా, సింగపూర్, రష్యా, జపాన్ లాంటి అభివృద్ధి చెందిన దేశాలలో అనేక కట్టడాలను భారతీయులే దగ్గర ఉండి నిర్మించారని, అలాంటి భారతీయులను కాదని నేడు చంద్రబాబు సింగపూర్, చైనా ఇంజనీర్‌లను తీసుకొచ్చి అమరావతిలో నూతన రాజధాని భవనాలు నిర్మించడం ఎంతవరకు సబబన్నారు. అంధ్రప్రదేశ్ కోసం తమ బిజేపి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తూ అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయేందుకు నరేంద్రమోదీ కృషి చేస్తుంటే తమ ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రతిపక్షాలే కాక మిత్ర పక్షం కూడా కృషి చేస్తోందని ఇది సమంజసం కాదన్నారు. రాజధానిని సకాలంలో నిర్మించేందుకు విదేశీ కంపెనీల కోసం దాపరిక పనులు ఎందుకు చేస్తుందో ఈ ప్రభుత్వం అర్థం కావడం లేదన్నారు. గతంలో ఇసుక మాఫియా, ఎర్రచందనం మాఫియా, నీరు చెట్టు ఇలాంటి కార్యక్రమాల్లో కేంద్ర నిధులు దుర్వినియోగం చేస్తున్నా తాము పట్టించుకోవడం లేదన్నారు. పోలవరం త్వరతిగతిన పూర్తి చేసేందుకు తమ ప్రభుత్వం తగు చర్యలు తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అథారిటికి చూపించాల్సిన లెక్కలు చూపించకుండా జాప్యం చేస్తుందన్నారు.