రాష్ట్రీయం

ప్రైవేట్‌లోనూ ఉచితమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూజివీడు, డిసెంబర్ 23: రాష్ట్రంలో నూతనంగా వస్తున్న ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనే ఆసక్తి ఉన్న పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వెల్లడించారు. ప్రైవేటు రంగంలో విశ్వవిద్యాలయాలను స్వాగతిస్తూ శాసనసభలో బిల్లు ఆమోదించామని, దీనికి అనుగుణంగా దేశంలో పేరొందిన పది ప్రైవేటు విశ్వవిద్యాలయాలు ఎపికి వస్తాయన్నారు. రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవం బుధవారం సాయంత్రం జరిగింది. ఈ సందర్బంగా తొమ్మిది మంది విద్యార్థినీ విద్యార్థులకు బంగారు పతకాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశ్వవిద్యాలయం కులపతి రాజ్‌రెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ ప్రైవేటు విశ్వవిద్యాలయాల రాక వల్ల రాష్ట్రంలో విద్యావిధానంలో మరిన్ని మార్పులు వస్తాయని చెప్పారు. ఎక్కువగా విద్యలో నాణ్యత పెరుగుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు.
ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో చదువుకోవాలనే ఆకాంక్ష ఉన్న పేద విద్యార్థులకు ఉచితంగా విద్య అందిస్తుందని, ఆయా విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఫీజు రియంబర్స్‌మెంట్ ఇస్తుందని చెప్పారు. దీని వల్ల గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేద విద్యార్థులకు కూడా నాణ్యమైన ఉన్నత విద్య అందుతుందని, తద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు. ప్రపంచంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలను కూడా రాష్ట్రానికి తీసువస్తానని, భవిష్యత్‌లో ప్రపంచం అంతా ఆంధ్రవైపే చూస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వానిదేనని చెప్పారు.
హైదరాబాదులో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు తో పాటు మరిన్ని సాంకేతిక విద్యాసంస్థలు ఏర్పాటు చేయటంతో హైదరాబాదు ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. విద్యారంగ నిపుణులు రాజ్‌రెడ్డితో కలసి ట్రిపుల్ ఐటీల రూపకల్పనకు శ్రీకారం చుట్టామని, ఫలితంగా నూజివీడు వంటి ప్రాంతంలో కూడా ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు జరిగిందని చెప్పారు. రాష్ట్ర విభజన అనంతరం రాష్ట్రం ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటున్నప్పటకీ విద్యారంగానికి బడ్జెట్ పెంచటంతో పాటు కేంద్రం నుండి పలు విద్యాసంస్థలు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నామని, రాష్ట్రాన్ని నాలెడ్జ్ హబ్‌గా అభివృద్ధి చేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సిఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో మరిన్ని ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేసి పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు విద్యా సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుండి ప్రకాశం జిల్లాలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేస్తామన్నారు. సాంకేతిక విద్యను పారిశ్రామికీకరణకు అనుసంధానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయని, వచ్చే విద్యాసంవత్సరం నుండి దీనిన అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా 974 కిలో మీటర్ల పొడవున మన రాష్ట్రానికి తీరప్రాంతం ఉందని, దీని ద్వారా ఎంతో అభివృద్ధి సాధించవచ్చని చెప్పారు. మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ ట్రిపుల్ ఐటీలు సాంకేతిక పరంగా ఎంతో ముందంజలో ఉన్నాయని, వీటిలో నెలకొని ఉన్న సమస్యలను అధిగమించటంతో పాటు మరిన్ని సంస్కరణలు చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటి నుండి ప్రతి ఏడాది ఒక్కొ ప్రాంతంలో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేస్తామని, వీటి ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయం కులపతి డి రాజ్‌రెడ్డి, ఉపకులపతి పి విజయ్ ప్రకాష్, డైరెక్టర్ పరిమి రామనరసింహం తదితరులు పాల్గొన్నారు.

చిత్రం.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు బంగారు పతకాలు అందచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు