రాష్ట్రీయం

వెలుగు చూసినవి 12హత్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 25: గ్యాంగ్‌స్టర్ నరుూం దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. నరుూం లెక్కలేని హత్యలు చేసినట్టు సిట్ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఇప్పటి వరకు నరుూం చేసిన 12 హత్యలు వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. తన సమాచారం బయటకు పొక్కిందని తెలిస్తే చాలు చంపేయడమే పనిగా పెట్టుకున్న నరుూం ఎన్నో నిండు ప్రాణాలు బలిగొన్నాడని పోలీసుల విచారణలో తేలింది. 2006లో ఆరిఫ్, 2010లో జానీపాషా, నల్గొండలో ఎం శ్రీనివాస్‌ను నరుూం కిరాతకంగా హతమార్చాడు. హైదరాబాద్‌లోని ఒక చోటుకి నరుూం వెళ్లాల్సి ఉండగా ఈ సమాచారం ముందుగానే బయటకు పొక్కడంతో ఆరిఫ్ కారణమని తెలుసుకొని అతడిని హత్య చేశాడు. పోలీస్ కస్టడీలో నరుూం భార్య హసీనా ఈ వివరాలన్నీ చెప్పినట్టు సమాచారం. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన జానీపాషాను ఇదే తరహాలో అంతమొందించాడు. వీరిద్దరూ నరుూంకు సమీప బంధువులని తెలుస్తోంది. అలాగే లావాదేవీల్లో భేదాభిప్రాయాలు రావడంతో శ్రీనివాస్‌ను హత్య చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. అంతకుముందు నరుూం సొంత తమ్ముడు అలీమొద్దీన్ కూతుళ్లు హీనా, షియాన్‌ల ఆచూకీ ఇప్పటికీ తేలకపోవడంతో వారిని కూడా చంపేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల నరుూం ఇంటి పనిమనిషి నస్రీన్ అస్తిపంజరం లభ్యం కావడం ఈ అనుమానానికి తావిస్తోంది. నరుూం ఇప్పటి వరకు 12 హత్యలు చేశాడని పోలీసులు అధికారికంగా పేర్కొంటున్నారు.
లష్కరే నుంచే నరుూంకు ఆయుధాలు
గ్యాంగ్‌స్టర్ నరుూం మాజీ నక్సలైట్ కావడంతో ఉగ్రవాద సానుభూతిపరులతో కూడా సంబంధాలు నెరపినట్టు అప్పట్లో కొంత ప్రచారం జరిగింది. నరుూం తన ముఠా సభ్యుల కోసం మారణాయుధాలు సమకూర్చుకునేందుకు ఓ ఉగ్రవాద సంస్థకు చెందిన కొందరు టెర్రరిస్టులతో కలసిపోయినట్టుగా కూడా ప్రచారం జరిగింది. అయితే ఈ విషయమై పోలీసులు ఆరా తీయగా లష్కరే తోయిబాతో సంబంధాలున్న సోహ్రాబుద్దీన్ ద్వారా నరుూంకు ఆయుధాలు చేరినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చినట్టు తెలిసింది. సోహ్రాబుద్దీన్ ద్వారానే నరుూంకు రెండు ఏకె 47 గన్‌లు అందినట్టు నరుూం భార్య హసీనా పేర్కొన్నట్టు సమాచారం. ఇదిలావుండగా గురువారం మైలార్‌దేవ్‌పల్లిలో నరుూం డ్రైవర్ ఫరుూంను పోలీసులు అరెస్టు చేశారు. నరుూం కేసులో ఏ2 నిందితుడిగావున్న ఫరుూంను విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
మరోసారి పోలీస్ కస్టడీకి నరుూం సోదరుడి దంపతులు
గ్యాంగ్‌స్టర్ నరుూం సోదరుడి దంపతులను సిట్ అధికారులు మరోసారి రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. చర్లపల్లి జైలు నుంచి ఫహీంను, చంచల్‌గూడ మహిళా జైలు నుంచి ఫహీం భార్య షాహిన్‌ను కస్టడీలోకి తీసుకున్నారు. సిట్ అధికారులు వీరిని రెండు రోజులపాటు విచారించనున్నారు. నరుూం సంపాదించిన ఆస్తులు, చేసిన హత్యల గుట్టును వీరి నుంచి తెలుసుకోనున్నారు. ఆంధ్ర, చత్తీస్‌గఢ్‌లలో నరుూం సంపాదించిన ఆస్తుల వివరాలు రాబట్టనున్నట్టు తెలిసింది. అలాగే వీరిని ఆయా ఆస్తుల దగ్గరకు తీసుకెళ్లి విచారించనున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం. కాగా నరుూం ఇంట్లో హత్యకు గురైన నదీం మృతహాన్ని రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో ఖననం చేసినట్టు తెలుస్తోంది.
పాతబస్తీలో అనుచరులు లేరు: డిసిపి
నరుూం కేసులో ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు పాతబస్తీపై కూడా దృష్టి సారించారు. అయితే హైదరాబాద్‌లోని పాతబస్తీవాసి యూసుఫ్ నరుూం అనుచరుడని వస్తున్న వార్తలను సౌత్‌జోన్ డిసిపి సత్యనారాయణ ఖండించారు. యూసుఫ్‌ను ఏడాది క్రితమే పిడి యాక్ట్ కింద అరెస్టు జైలుకు తరలించినట్టు ఆయన పేర్కొన్నారు. పాతబస్తీలో నరుూం అనుచరులు లేరని ఆయన గురువారం స్పష్టం చేశారు. నరుూం కేసులో పాతబస్తీలో వస్తున్న వదంతులు నమ్మవద్దని డిసిపి సూచించారు.